ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) సోదరుడు నారా రామ్మూర్తినాయుడు గతేడాది నవంబరులో అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్ ఇతర కుటుంబసభ్యులు దగ్గరుండి అంత్యక్రియల కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఆయన కుమారుడైన హీరో నారా రోహిత్‌ను ఓదార్చారు. ఇవాళ రామ్మూర్తినాయుడి జయంతి సందర్భంగా మరోసారి ఆయనను చంద్రబాబు తలుచుకున్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
- Advertisement -
“నా సోదరుడు నారా రామ్మూర్తినాయుడు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. మా కుటుంబంలోనే కాకుండా ప్రజాక్షేత్రంలో కూడా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఆయన భౌతికంగా దూరమైనా జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి. ఆయన స్మృతికి మరొక్కసారి నివాళి అర్పిస్తున్నాను” అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.