పొట్టకూటి కోసం పరాయి దేశం వెళ్లి అక్కడే అసువులు బాసిన వలస జీవి.. కొత్త దాంరాజు పల్లి గ్రామానికి చెందిన కాసర్ల రాజిరెడ్డి (45) గత 26 ఏళ్ల నుండి ఉపాధి నిమిత్తం పరాయి దేశానికి వలస వెళుతు అక్కడే పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.. రాజారెడ్డి కి భార్య, ముగ్గురు కూతుర్లు, కొడుకు ఉన్నారు. చాలీచాలని జీతంతో సరిపెట్టుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ముగ్గురు కూతుర్లలో ఇద్దరి కూతుళ్లకు వివాహం జరగగా, ఇంకో కూతురు వివాహానికి ఉన్నది. గత ఇరవై ఐదు రోజుల క్రితం చిన్న కూతురు వివాహం నిశ్చయమైంది. కూతురికి కాబోయే మామ పెళ్ళికి కొద్ది గంటల ముందు అకాల మరణం చెందడంతో పెళ్లిని రద్దు చేశారు. ఈ విషయం దుబాయ్ లో ఉన్న రాజారెడ్డికి తెలవగా అప్పటి నుండీ మానసిక వేదనకు గురై, దిగ్భ్రాంతికి లోనయ్యాడు. అప్పటి నుండీ కన్నీరు పెట్టుకుంటూ, లోలపల బాధ పడుతూ డ్యూటీకి వెళుతూ పని చేస్తున్నాడు. గురువారం రోజున డ్యూటీకి వెళ్లొచ్చు నిద్రించగా తెల్లవారి చూసేసరికి విగత జీవిగా పడిఉన్నాడు. మిత్రులు గమనించి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. అందరితో కలిసి మెలిసి పనిచేసుకునే వ్యక్తి అకారణంగా వచ్చిన గుండెపోటుతో మృతి చెందడంతో అతని రూమ్మేట్స్, కుటుంబీకులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. రాజా రెడ్డి అకాల మరణంతో గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Mallapur: గల్ఫ్ దేశంలో అసువులు బాసిన వలస జీవి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES