Wednesday, March 19, 2025
Homeఇంటర్నేషనల్Sunita Williams: సురక్షితంగా భూమికి చేరుకున్న.. సునీతా విలియమ్స్..!

Sunita Williams: సురక్షితంగా భూమికి చేరుకున్న.. సునీతా విలియమ్స్..!

సునీతా విలియమ్స్, ఆమె తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ సురక్షితంగా భూమికి చేరుకున్నారు. నాసా క్రూ డ్రాగన్ స్పేస్ ఫ్లైట్ వారిని క్షేమంగా తిరిగి భూమికి తీసుకొచ్చింది. వీరితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా తిరిగి వచ్చారు. అంతరిక్షంలో 9 నెలలు గడిపిన తర్వాత, బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు ఫ్లోరిడా సమీపంలోని సముద్ర జలాల్లో క్రూ డ్రాగన్ ల్యాండ్ అయింది. భారత సంతతికి చెందిన సునీత తిరిగి క్షేమంగా రావడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:15 గంటలకు క్రూ డ్రాగన్ అంతరిక్ష కేంద్రం నుండి బయలుదేరింది. 17 గంటల ప్రయాణం తర్వాత బుధవారం తెల్లవారుజామున భూమిపై దిగింది. ఈ విజయవంతమైన ప్రయాణం తర్వాత సునీత మరియు ఇతర వ్యోమగాములకు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలో కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదంలో ఏడుగురు వ్యోమగాములు మరణించారు. అప్పట్లో షటిల్ కాలిపోవడంతో ఆ ప్రమాదం జరిగింది. ఈసారి కూడా డ్రాగన్ క్యాప్సుల్ గంటకు 27,358 కిలోమీటర్ల వేగంతో భూమిని సమీపిస్తుండగా, వాతావరణంలో భారీ రాపిడిని తట్టుకుని సురక్షితంగా ల్యాండ్ అయింది. సముద్రంలో దిగే ముందు క్యాప్సుల్ వేగాన్ని తగ్గించడం ద్వారా ప్రమాదాలను నివారించారు.

భూమికి చేరుకునే ముందు, వేగాన్ని గంటకు 186 కిలోమీటర్లకు తగ్గించి, నాలుగు పారాచూట్‌లను తెరిచారు. క్యాప్సుల్ సముద్రంలో దిగిన వెంటనే, నాసా బృందం వారిని ఒక పెద్ద నౌకలోకి తరలించింది. నలుగురు వ్యోమగాములను ఆరోగ్య పరీక్షల నిమిత్తం హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తీసుకెళ్తారు. అక్కడ వారు కొన్ని రోజులు గడిపి, భూవాతావరణానికి అలవాగుతారు.

సునీత మరియు విల్మోర్ జూన్ 5, 2024న బోయింగ్ స్టార్‌లైనర్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఎనిమిది రోజుల తర్వాత వారు తిరిగి రావాల్సి ఉండగా, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో వారు తొమ్మిది నెలలు అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది. చివరకు, ఎలాన్ మస్క్ యొక్క స్పేస్‌ఎక్స్ కంపెనీకి చెందిన క్రూ డ్రాగన్ వారిని సురక్షితంగా భూమికి తీసుకొచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News