హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్(IPL 2025) మ్యాచ్‌లు వీక్షించే అభిమానులకు టీజీఎస్ ఆర్టీసీ(TGSRTC) శుభవార్త అందించింది. వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి వచ్చేందుకు గ్రేటర్ పరిధిలోని 24 డిపోల నుంచి 60 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్న తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో మార్చి 27, ఏప్రిల్ 6, 12, 23, మే 5, 10, 20, 21 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
ప్రధానంగా ఘట్‌కేసర్, హయత్‌నగర్, ఎన్జీవోస్ కాలనీ, ఎల్బీనగర్, కోఠి, లక్డీకాపూల్, దిల్‌సుఖ్‌నగర్, మేడ్చల్, కేపీహెచ్‌బీ, మియాపూర్, జేబీఎస్, ఈసీఐఎల్, బోయిన్‌పల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం, బీహెచ్ఈఎల్ వంటి వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచనుంది. అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.