Tuesday, July 15, 2025
HomeతెలంగాణTG Assembly: అసెంబ్లీలో గందరగోళం.. బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు నిరసన

TG Assembly: అసెంబ్లీలో గందరగోళం.. బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు నిరసన

తెలంగాణ అసెంబ్లీ(TG Assembly)లో గందరగోళం నెలకొంది. పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం సుప్రీంకోర్టులోఅంశంపై సీఎం అలా ఎలా మాట్లాడుతారని బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు ఆందోళనకు దిగాయి. స్పీకర్ పోడియం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. కోర్టు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై సీఎం సభలో ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు.

- Advertisement -

ప్రతిపక్షాల నిరసనలను మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి కోర్టు తీర్పు గురించి మాట్లాడలేదని.. కేవలం ఫిరాయింపుల విషయంలో గతంలో మాదిరిగానే వ్యవహరిస్తామని అన్నారని వివరణ ఇచ్చారు. ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నాయకులు చేస్తోన్న బెదిరింపుల గురించి మాత్రమే మాట్లారని క్లారిటీ ఇచ్చారు. అయినా సంతృప్తి చెందని బీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News