రాష్ట్రంలో లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లను ఈ-వేలం ద్వారా ఔత్సాహికులకు కేటాయించేందుకు మద్యనిషేధ, అబ్కారీ శాఖ సంచాలకులు నోటిఫికేషన్ జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 44 బార్లను ఈ-వేలం(E-auction bars) ఆన్ లైన్ లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. బార్ల లైసెన్సులు తీసుకునేందుకు ఆసక్తి గల వారు ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏప్రిల్ 7తో ఈ ప్రక్రియ ముగుస్తుంది
అభ్యర్థులు తిరిగి చెల్లించని దరఖాస్తు రుసుమును ఏప్రిల్ 8లోగా చెల్లించాల్సి ఉంటుంది.50వేల జనాభా ఉంటే రూ.5 లక్షలు, 50వేలు- 5 లక్షల జనాభా వరకు రూ.7. 5లక్షలు, 5 లక్షలకు పైగా జనాభా ఉంటే రూ.10లక్షలుగా దరఖాస్తు రుసుములు నిర్ణయించారు.
ఆన్లైన్ ప్రక్రియ ద్వారా అధిక మొత్తంలో పాడుకున్న అభ్యర్థికి ఏప్రిల్ 9న బార్ కేటాయిస్తారు. నగరపాలికలు, ప్రదేశాల వారీగా బార్ల వివరాలు, ఆఫ్ సెట్ ధరలు, గెజిట్ నోటిఫికేషన్ వివరాలు http:///apcpe.aptonline.in ఉంచారు. ఇతర వివరాలకు 8074396416 ఫోన్ నంబరులో సంప్రదించాలని అధికారులు కోరారు.