Saturday, April 5, 2025
HomeతెలంగాణBJP: హైదరాబాద్‌ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్‌రావు

BJP: హైదరాబాద్‌ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్‌రావు

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(Hyderabad MLC Election-2025) అభ్యర్థిని బీజేపీ(BJP) అధిష్ఠానం ప్రకటించింది. గతంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గౌతమ్ రావు(Gautam Rao)ను తమ అభ్యర్థిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ ఎం.ఎస్‌. ప్రభాకర్‌ (MS Prabhakar) పదవీ కాలం మే 1తో ముగియనుంది.

- Advertisement -

దీంతో కొత్త ఎమ్మెల్సీ ఎన్నికకు ఏప్రిల్‌ 23న పోలింగ్‌ జరగనుంది. నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 4 వరకు గడువు ఉండగా.. ఏప్రిల్ 7వ తేదీన నామినేషన్లు పరిశీలించనున్నారు. ఏప్రిల్ 9వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఇక ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఏప్రిల్‌ 25న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News