వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Bill)కు పార్లమెంటులో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును సుప్రీంకోర్టు(Supreme Court)లో సవాల్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) తెలిపారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘ఇండియా కూటమి అతిత్వరలో వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీం కోర్టులో సవాల్ చేయనుంది. భారత రాజ్యాంగంలోని సూత్రాలు, నిబంధనలపై దాడి చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని మేం ప్రతిఘటిస్తూనే ఉంటాం’ అని ఆయన రాసుకొచ్చారు.
కాగా వక్ఫ్ బిల్లుపై బుధవారం లోక్‌సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. ఇక గురువారం ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. దీంతో రాష్ట్రపతి సంతకం కోసం ఈ బిల్లులను కేంద్ర ప్రభుత్వం పంపించనుంది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టంగా మారనుంది.