ఐపీఎల్ 18వ సీజన్‌ను భారీ విజయంతో ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు సన్‌రైజర్స్ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma), ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అభిషేక్, నితీశ్‌లకు అమ్మవారి ప్రసాదం అందించారు. ఆ తర్వాత ఆలయ అధికారులు ఇద్దరినీ సన్మానించారు.