అన్నమయ్య జిల్లా సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతి చెందడం బాధాకరమని మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) సంతాపం వ్యక్తం చేశారు. సమాచారం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. వారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ, కన్నీటి నివాళి అర్పిస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సంబంధిత యంత్రాంగాన్ని కోరుతున్నాను. వారంతా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాను.
ఎదురెదురుగా కార్లు ఢీకొనటంతో
అన్నమయ్య జిల్లాలో సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(Special Deputy Collector) రమాదేవి మరణించారు.
ప్రమాదంలో మరో నలుగురికి గాయలయ్యాయి. పీలేరు నుంచి రాయచోటిలోని కలెక్టరేట్లో పిజిఆర్ కి వెళ్తూ రోడ్డు ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నాయి. కేసు నమోదు చేసుకుని పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.