కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. బొలెరో వాహనం అదుపుతప్పి వంతెనను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన వ్యక్తులు గొర్రెలను కొనుగోలు చేసేందుకు బొలెరో వాహనంలో కర్ణాటకకు వెళ్లారు. యాద్గిర్ జిల్లాలోని షాపూర్ వైపు వెళ్తుండగా మార్గం మధ్యలో డ్రైవర్ వంతెనను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను నాగరాజు, సోమ, నాగభూషణ్, మురళిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Road Accident: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసులు మృతి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES