Thursday, April 24, 2025
Homeనేషనల్Encounter: భీకర ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Encounter: భీకర ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ (Chhattisgarh-Telangana) సరిహద్దులోని బీజాపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌(Encounter)లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా ధర్మ తాళ్లగూడెం కర్రె‌గుట్టల్లో మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ హిడ్మాతో పాటు దామోదర్ లాంటి అగ్ర నాయకులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

- Advertisement -

ఈ నేపథ్యంలో 5వేల మందితో డీఆర్‌జీ బస్తర్ ఫైటర్ కోబ్రా, సీఆర్‌పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు కూంబింగ్ ఆపరేషన్‌‌లో భారీగా పాల్గొంటున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టు సాయుధ విభాగమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, భద్రతా దళాలకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో మొత్తం ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అశకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News