Friday, April 25, 2025
Homeహెల్త్ఈ లక్షణాలు క్యాన్సర్‌ కు సంకేతాలు.. ముందే గుర్తిస్తే మీరు సేఫ్..!

ఈ లక్షణాలు క్యాన్సర్‌ కు సంకేతాలు.. ముందే గుర్తిస్తే మీరు సేఫ్..!

క్యాన్సర్‌ అనేది ఒక్కసారిగా ముప్పుగా మారే వ్యాధి కాదు. ఇది మన శరీరంలో చిలిపిగా, నిశ్శబ్దంగా పెరుగుతూ చివరికి మన ఆరోగ్యాన్ని భగ్నం చేసే ప్రమాదకరమైన వ్యాధి. చాలాసార్లు, ఈ వ్యాధి తీవ్ర దశకు చేరుకున్నాకే బయట పడుతుంది. అయితే శరీరం చిన్నచిన్న సంకేతాలతో ముందే హెచ్చరిస్తూ ఉంటుంది. వాటి పట్ల నిర్లక్ష్యం చేస్తే.. చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. వీటిని పక్కనపెట్టకుండా ముందుగానే గుర్తిస్తే, చికిత్సకు మార్గం సులభమవుతుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. భయంతో కాకుండా జాగ్రత్తతో జీవించడం అవసరం. క్యాన్సర్‌ లక్షణాలు వ్యక్తికి వ్యక్తికి మారుతుంటాయి కానీ, కొన్ని సాధారణ సంకేతాలు మాత్రం మిగతా వారిలో కూడా కనిపించవచ్చు. ఇవేంటో తెలుసుకోండి, అప్రమత్తంగా ఉండండి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.

- Advertisement -

క్యాన్సర్‌ను సూచించే సాధారణ సంకేతాలు:
ఏ కారణం లేకుండా బరువు తగ్గిపోవడం: డైటింగ్, వ్యాయామం లేకుండానే ఒకేసారి 4-5 కిలోల బరువు తగ్గిపోతే, అది గర్భాశయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లకు సంకేతం కావొచ్చు.

అలసట, ఫోకస్ తగ్గడం: ఎల్లప్పుడూ అలసటగా ఉండటం, ఫోకస్‌ తగ్గిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడటం లాంటివి లుకేమియా, పెద్దప్రేగు క్యాన్సర్‌లకు సంబంధించి సూచనలు కావచ్చు.

చర్మంపై అనూహ్య మార్పులు: పెరుగుతున్న పుట్టుమచ్చలు, నయమవని పుండ్లు లేదా రంగు మారడం లాంటివి చర్మ క్యాన్సర్, కాలేయ సంబంధిత సమస్యలను సూచించవచ్చు.

నొప్పులు: వెన్నునొప్పి, తలనొప్పి లేదా కడుపునొప్పి తరచూ ఉండడం అండాశయ క్యాన్సర్, ఎముక క్యాన్సర్, మెదడు క్యాన్సర్‌ సంకేతాలు కావచ్చు.

అసాధారణ రక్తస్రావం: మలంలో, మూత్రంలో, దగ్గులో రక్తం రావడం, క్రమరహిత పీరియడ్స్‌ వంటి లక్షణాలను తేలికగా తీసుకోకండి. ఇవి క్యాన్సర్‌కు సంబంధించిన తీవ్రమైన సంకేతాలు కావచ్చు.

క్యాన్సర్ నివారణ:
ప్రతి ఏడాది స్క్రీనింగ్‌ చేయించుకోవడం, ముఖ్యంగా 40 ఏళ్లు పైబడినవారు తప్పనిసరిగా చేయాలి.
ధూమపానం, మద్యం దూరంగా ఉంచడం.
ఆరోగ్యకరమైన ఆహారం, నిత్య వ్యాయామం అలవాటు చేసుకోవడం.
ఒత్తిడిని తగ్గించుకోవడం, నిద్ర పూర్తిగా పొందడం కూడా కీలకం.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముందస్తుగా క్యాన్సర్‌ను గుర్తిస్తే, చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు 90 శాతానికి పైగా ఉంటాయి. మీ శరీరం చెప్పే చిన్నచిన్న సంకేతాలను గుర్తించండి. అవగాహనతో ముందడుగు వేయడం ద్వారా.. ప్రాణాలను కాపాడుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News