దాయాది పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోతోంది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో పాక్ దళాలు కాల్పులకు తెగబడినట్టు సమాచారం. సరిహద్దు వెంటనే ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో శ్రీనగర్ నగరంలో బ్లాకౌట్ అమలు చేశారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు మసీదు లౌడ్స్పీకర్లు వినియోగించారు. ప్రజలందరూ తమ ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని సూచించారు.
శ్రీనగర్‌లో బ్లాకౌట్ అమలైన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందించారు. శ్రీనగర్‌లో సంపూర్ణ బ్లాకౌట్. కాీన భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి.. బహుశా అవి భారీ ఫిరంగుల కాల్పుల శబ్దాలవచ్చుని ట్వీట్ చేశారు. దీనితో చీకటిలో దిగిన ఫోటో కూడా ఆయన విడుదల చేశారు.
ఈ సందర్భంగా జమ్మూ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు.. దయచేసి రోడ్లపైకి రావొద్దని.. ఇంట్లోనే ఉండాలని లేదా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఆయన సూచించారు. అనవసర పుకార్లను నమ్మవద్దని. ఫేక్ న్యూస్‌ను షేర్ చేయొద్దని తెలిపారు. మనం అందరం కలిసే ఈ సంక్షోభాన్ని అధిగమించగలమని పేర్కొన్నారు.
ఇక మరోవైపు, భారత్ మీద డ్రోన్లతో దాడికి పాక్ ప్రయత్నిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అయితే భారత సైన్యం ఇప్పటికే అప్రమత్తమై, పాక్ శక్తిని సమర్థంగా తిప్పికొడుతోందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తతకు సంబంధించి చర్యలు మరింత ముమ్మరంగా సాగుతున్నాయి.