Wednesday, May 14, 2025
Homeనేషనల్BR Gavai: నూతన సీజేఐగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ప్రమాణస్వీకారం

BR Gavai: నూతన సీజేఐగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ప్రమాణస్వీకారం

సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా(CJI) జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ (Justice BR Gavai) ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. వీరందరి సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము గవాయ్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. సీజేఐ పీఠాన్ని అధిరోహించిన రెండో దళిత వ్యక్తిగా గవాయ్‌గా పేరు దక్కించుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ(PM Modi) ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ ఏడాది నవంబరు 23న పదవీవిరమణ చేస్తారు.

- Advertisement -

కాగా మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబరు 24న గవాయ్‌ జన్మించారు. 2003 నవంబరు 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 నవంబరు 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News