ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో విషాదం చోటు చేసుకుంది. కోమటిగుంట చెరువులో మునిగి ముగ్గురు మృతి చెందారు. భీమడోలు మండలంలోని పెదలింగంపాడులో ఓ వేడుకకు హాజరైన నలుగురు వ్యక్తులు కాలకృత్యాల కోసం కోమటిగుంట చెరువు వద్ద ఆగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ చెరువులో పడి ముగ్గురు కన్నుమూయగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. మృతులను పెదవేగి మండలం వేగివాడ గ్రామానికి చెందిన అజయ్ (28), అభిలాష్ (16), సాగర్ (16)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైన ఇద్దరు వ్యక్తుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల సహాయంతో గాలిస్తున్నారు. కాగా కడప జిల్లాలో మంగళవారం నలుగురు పిల్లలు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Crime News: ఏపీలో మరో విషాదం.. చెరువులో మునిగి ముగ్గురు మృతి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES