ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (Polycet Results) ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. కాగా ఏప్రిల్ 30న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పాలిసెట్‌కు 1,57,482 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,39,749 మంది పరీక్ష రాశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లోని డిప్లొమా (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ) సీట్లను పాలిసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ కోసం అధికారిక వెబ్ సైట్ సందర్శించండి.
Polycet Results: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల
సంబంధిత వార్తలు | RELATED ARTICLES