తిరుమల(Tirumala) శ్రీవారికి మైసూరు రాజమాత ప్రమోదాదేవి రెండు భారీ వెండి అఖండ దీపాలను విరాళంగా అందజేశారు. రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి, ఇతర ఆలయ అధికారులకు వాటిని అందించారు. ఒక్కో వెండి అఖండం సుమారు 50 కిలోల బరువు ఉంటుంది.
ఈ వెండి అఖండ దీపాలను శ్రీవారి ఆలయంలోని గర్భగుడిలో నిరంతరం వెలిగించేందుకు ఉపయోగిస్తారు. ఇవి ఆలయ సంప్రదాయంలో భాగమైన అత్యంత పవిత్రమైన దీపాలు.సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహారాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్లు సమాచారం. శతాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ మైసూరు రాజమాత వాటిని సమర్పించడం విశేషం. కాగా మైసూరు రాజవంశీకులు తరతరాలుగా శ్రీవారి భక్తులు కావడం, ఆలయానికి ఎన్నో కానుకలు సమర్పించడం తెలిసిందే.