Monday, May 19, 2025
Homeచిత్ర ప్రభSuriya: తెలుగులో హీరోగా సూర్య ఎంట్రీ.. దర్శకుడు ఎవరంటే..?

Suriya: తెలుగులో హీరోగా సూర్య ఎంట్రీ.. దర్శకుడు ఎవరంటే..?

త‌మిళ స్టార్ హీరో సూర్యకు(Suriya) తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు తెలుగులో స్ట్రెయిట్ సినిమాను చేయలేదు. ఇన్నాళ్లకు ఆయన నేరుగా తెలుగులో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. తమిళ హీరో ధనుష్‌తో ‘సార్’, మలయాళం హీరో దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ మూవీలతో హిట్లు కొట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీని తెరకెక్కించనున్నారు. సూర్య కెరీర్‌లో 46వ చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.

- Advertisement -

‘ప్రేమలు’ హీరోయిన్ మమిత బైజు క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా రవీనా టాండన్, రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజ‌రై క్లాప్ కొట్టారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ ల‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్ర‌కాశ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News