ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల(LSG vs SRH) మధ్య మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హైదరాబాద్ 8వ స్థానంలో, లక్నో 7వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. లక్నో మాత్రం ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలవాలని చూస్తోంది.
లక్నో జట్టు: మార్‌క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ఆకాశ్ దీప్, రవి, దిగ్వేశ్ రాఠీ, అవేశ్ ఖాన్, విలియం ఓ రూర్క్
హైదరాబాద్ జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, హర్ష్ దూబె, జీషాన్ అన్సారీ, ఎషాన్ మలింగ