మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి తారక్ నటిస్తున్న ‘వార్ 2′(War 2 Teaser) మూవీ టీజర్ విడుదలైంది. నిమిషం 34 సెకన్లు ఉన్న ఈ టీజర్ అదిరిపోయింది. ‘నా కళ్లు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతున్నాయి కబీర్..’ అంటూ ఎన్టీఆర్ డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ఇక ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే ఫైటింగ్ టీజర్‌కే హైల్‌ట్‌గా నిలిచింది.
- Advertisement -
మొత్తానికి టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.