ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) స్పిన్ బౌలర్ దిగ్వేశ్ రాఠీ(Digvesh rathi)సెలబ్రేషన్స్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. వికెట్ తీసిన ప్రతిసారీ నోట్‌బుక్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. దీనిపై ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే రెండు సార్లు జరిమానా విధించింది. అయినా కానీ మనోడు తీరు మారలేదు. సోమవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (Sunrisers Hyderabad) అభిషేక్ శర్మ వికెట్ తీసిన అనంతరం ఇలాంటి సెలబ్రేషన్ చేసుకున్నాడు. అయితే ఈ సందర్భంగా అభిషేక్‌తో వాగ్వాదానికి దిగాడు.
ఈ సీజన్‌లో మూడోసారి ఐపీఎల్‌ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకుగాను దిగ్వేశ్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు మే 22న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరగనున్న మ్యాచ్ నుంచి సస్పెండ్ చేసింది.అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించి ఓ డీ మెరిట్ పాయింట్‌ను వేసింది.