ఇవాళ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) పుట్టినరోజును అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, సన్నిహితులు తారక్‌కు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నారా రోహిత్, రామజోగయ్య శాస్త్రి, గోపీచంద్ మలినేని, కమెడియన్ రఘు, నందమూరి కళ్యాణ్ రామ్, నిర్మాత నాగవంశీ ఇలా అనేక మంది తమ విషెస్ తెలియజేశారు.
హ్యాపీ బర్త్ డే తారక్.. ఈ సంవత్సరం సంతోషం, సక్సెస్, ఆయురారోగ్యాలతో ఉండాలని మహేశ్ బాబు విష్ చేశాడు.

హ్యాపీ బర్త్ డే బావా.. ఎప్పుడూ ఇలా ఆయురారోగ్యాలతో ఉండాలి అని బన్నీ ట్వీట్ వేశాడు.
హ్యాపీ బర్త్ డే తారక్ అన్నా అంటూ విజయ్ దేవరకొండ ఎన్టీఆర్‌కు విషెస్ చెప్పాడు.

హ్యాపీ బర్త్ డే నాన్నా అంటూ కళ్యాణ్ రామ్ తన తమ్ముడి మీద ప్రేమను కురిపించాడు.