ఇవాళ ఎన్టీఆర్(NTR) 43వ ఏటలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా తారక్‌కు సెలబ్రెటీలు, అభిమానులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ఎన్టీఆర్ ధన్యవాదాలు చెబుతూ థ్యాంక్స్ నోట్ విడుదల చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“అప్పుడప్పుడు నేను నా ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకున్న ప్రతిసారీ మొదట గుర్తుకువచ్చేది మీరే. అభిమానులు ఎల్లప్పుడూ నాతో ఉన్నందుకు, నాకు శుభాకాంక్షలు చెబుతున్నందుకు ధన్యవాదాలు. ఇక ‘వార్ 2’ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆగస్టు 14న మీరు ఆ సినిమాని చూసి అనుభూతి చెందేందుకు నేను వెయిట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. నా శ్రేయోభిలాషులు, మీడియా, సినీ పరిశ్రమలోని సన్నిహితులు అందరికి ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. కాగా ఎన్టీఆర్ పుట్టినరోజున పురస్కరించుకుని విడుదలైన ‘వార్2’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. టీజర్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.