Thursday, May 22, 2025
Homeఆంధ్రప్రదేశ్YSRCP: వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. ఈ సారి ఏమయ్యిందంటే..?

YSRCP: వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. ఈ సారి ఏమయ్యిందంటే..?

ఏపీ రాజకీయాల్లో వైసీపీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, ఇప్పుడు స్థానిక సంస్థల ఫ్రంట్‌లో కూడా ఫ్యాన్ పార్టీ పరిస్థితి దారుణంగా మారుతోంది. ఇటీవల కూటమి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను వరుసగా స్వాధీనం చేసుకుంటూ వైసీపీకి షాకుల మీద షాక్‌లు ఇస్తోంది.

- Advertisement -

తాజాగా అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన దిల్షా దున్నీషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్లుగా సుధారాణి, రాజశేఖర్ ఆచారిలు ఎన్నికయ్యారు. వైసీపీ ఈ ఎన్నికను బహిష్కరించగా, 36 మంది కౌన్సిలర్లలో 11 మంది గైర్హాజరు కావడంతో, 25 మంది మద్దతుతో టీడీపీ విజయం సాధించింది.

విజయనగరం జిల్లా బొబ్బలి మున్సిపాలిటీలోనూ టీడీపీ తన పట్టు చూపింది. అవిశ్వాస తీర్మానం ద్వారా మున్సిపల్ ఛైర్మన్ మురళీకృష్ణారావును తప్పించి, శరత్‌బాబును ఛైర్మన్‌గా ఎన్నిక చేసింది.

ఇక పలుచోట్ల ఎంపీపీ, ఛైర్మన్ ఎన్నికలు వాయిదా పడుతున్నా, ఆ ఎన్నికల్లోనూ వైసీపీకి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. తిరువూరు, రామగిరి వంటి ప్రదేశాల్లో వైసీపీ సభ్యులు గైర్హాజరుకావడంతో ఎన్నికలు నిలిచిపోయాయి.

ఓటమి తర్వాత వైసీపీకి నేతలు వదిలి వెళ్లడం, కార్పొరేటర్లు విపక్షాల్లోకి చేరడం పార్టీకి డిజాస్టర్ మోడ్‌ను తలపిస్తోంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత, స్థానిక సంస్థలపై పట్టు కోల్పోవడం ద్వారా పార్టీ బలహీనపడుతోంది.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మౌలిక వసతులపై దృష్టిపెట్టిన తీరుతో ప్రజల్లోనూ మంచి స్పందన కనిపిస్తోంది. మొత్తానికి, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కంచుకోటలు కూలిపోతున్నాయన్న మాట నిజం కావచ్చని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News