Sunday, October 6, 2024
HomeతెలంగాణTUWJ (IJU): జర్నలిస్ట్ ల భద్రత కోసం మీడియా కమిషన్ కావాలి

TUWJ (IJU): జర్నలిస్ట్ ల భద్రత కోసం మీడియా కమిషన్ కావాలి

ప్రస్తుతం అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో జర్నలిజం ఎదుర్కుంటున్న సవాళ్లు, జర్నలిస్ట్ లపై జరుగుతున్న దాడులు, కేసులతో పాటుగా, చివరికి హత్యల వరకు పరిస్థితి వెళ్ళడం దురదృష్టకరమని, జర్నలిస్ట్ ల భద్రతకై ప్రత్యేకంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలనీ TUWJ (IJU) అధ్యక్ష, కార్యదర్శులు చీటీ శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి మోరపల్లి ప్రదీప్ కుమార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ – ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో iju జాతీయ శాఖ ఆదేశాల మేరకు ప్లకార్డులతో నిరసన తెలిపారు. అంతకు ముందు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురుల వర్ధంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

- Advertisement -

జర్నలిజం పట్ల దేశంలోని పాలకుల నిర్లిప్తత యావత్ జర్నలిస్ట్ లోకాన్ని ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఆయా మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్ట్ లకు వేతనాలు లేక, వేతనాలు ఉండి చాలీ చాలని వేతనాలతో ఉద్యోగ భద్రత లేక, వేతన చట్టం అమలు కాక,  గతంలో వేసిన ఆయా కమిటీల సిఫారసులు అమలు లేకపోవడం జర్నలిస్ట్ ల సేవలు, వారి జీవితం  వెట్టి చాకిరీగా మారిందన్నారు. ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మీడియా కృషి చేస్తున్న తరుణంలో, నాలుగో స్థంభంగా పిలవబడే మీడియాకు స్వతంత్రత ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. క్లిష్ట పరిస్థితిలో ఉన్న మీడియా బలహీనతను ఆసరాగా చేసుకొని కొందరు పెట్టుబడి, కార్పొరేట్ దారులు తమ చేతుల్లోకి మీడియని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యంకు గొడ్డలి పెట్టుగా అభివర్ణించారు. స్వతంత్ర, సుందర భారత నిర్మాణంతో పాటుగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో మీడియా పాత్ర వెలకట్టలేనిదనే విషయాన్ని పాలకులు గమనించుకోవాలన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా స్వేచ్ఛను హరిస్తున్న తరుణంలో జర్నలిస్ట్ లోకం మేధావులు కవులు కళాకారులూ మేలుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మీడియా స్వేచ్చ ప్రమాదం పడినందున దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పాత్రికేయుడు, ప్రజలపై ఉందన్నారు. ఇప్పటికైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిజం, జర్నలిస్ట్ ల హక్కులను హరించకుండా కాపాడాలని, జర్నలిస్ట్ ల భద్రత కోసం జర్నలిస్ట్ రక్షణ చట్టం లేదా ప్రత్యేక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు.

జర్నలిస్ట్ లపై జరుగుతున్నా దాడులను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు టివి సూర్యం, సంపూర్ణ చారి, బొడ్డుపెల్లి అంజయ్య,కమలాకర్,సిరిసిల్ల వేణు,సత్యం, వంశీ, హన్మంత్ పటేల్, గోపాల చారి, గాజల మహేష్, నాగరాజు, రాజ్ కుమార్, సట్ట శ్రీనివాస్, సులేమాన్, జయంత్ నేత, నాజిమ్, మహేష్, సత్యనారాయణ, నరహరి, సాబీర్, ఇక్రమోద్దీన్, ప్రవీణ్, బాస మహేష్, సంపత్, ఆయా పార్టీల నాయకులు ఏ. సి. ఎస్ రాజన్న, రాగిల్లా సత్యనారాయణ, కాశినాథం, బిట్టు తో పాటుగా జర్నలిస్ట్ మిత్రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News