ఏపీలో కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ(DSC)కి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం అభ్యర్థులు లేవనెత్తిన అంశాల్లో సరైన కారణాలు లేవని పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేసింది. ఏవైనా సమస్యలు ఉంటే హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేయాలని జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం సూచించింది. టెట్, డీఎస్సీ షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని ఆదేశాలు జారీ చేసింది.
కాగా ఏపీలో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 6 నుంచి జులై 6 వరకు సీబీటీ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తి అయింది.