Monday, June 9, 2025
HomeదైవంVastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం డైనింగ్‌ టేబుల్‌ ఎక్కడ ఉండాలి..?

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం డైనింగ్‌ టేబుల్‌ ఎక్కడ ఉండాలి..?

Vastu Tips For Dining Table At Home: సాధారణంగా ప్రతిఒక్కరి ఇంట్లో డైనింగ్‌ టేబుల్‌ ఉంటుంది. చాలామంది డైనింగ్‌ టేబుల్‌ గ్రాండ్‌గా కనిపించాలని ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. డైనింగ్ టేబుల్‌ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తూ, ఆనందంగా గడపడానికి ఉపయోగపడుతుంది. అయితే వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం, డైనింగ్‌ టేబుల్‌ ఉంచే ప్రదేశం ఇంటికి సానుకూలతను తెస్తుంది. ఏ ప్రదేశంలో డైనింగ్ టేబుల్ ఉంచడం మంచిది? ఏ దిశలు అనుకూలం కాదు? అనే వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

డైనింగ్‌ టేబుల్‌ను ఉండే సరైన దిశలు:

ఉత్తర దిశ (North):

వాస్తు శాస్త్రం ప్రకారం డైనింగ్‌ టేబుల్‌ను ఉత్తర దిశలో ఉంచడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ దిశలో భోజనం చేయడం వల్ల మానసిక ప్రశాంతత, ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది.

తూర్పు దిశ (East):

తూర్పు దిశలో డైనింగ్‌ టేబుల్‌ను ఉండడం వల్ల ఇంట్లో ఉండే కుటుంబసభ్యులు ఆనందంగా ఉంటారు. ఇటు వైపు భోజనం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కలగకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రతిరోజు ఉదయం సూర్యరశ్మి ఉండే తూర్పు దిశలో ఉంచితే బోలెడు లాభాలు కలుగుతాయి.

వాయువ్య దిశ (North-West):

డైనింగ్‌ టేబుల్‌ ఈ దిశలో ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలు పెరుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఏ దిశలు అనుకూలం కాదు?

నైరుతి దిశ (South-West):

ఇంట్లో డైనింగ్‌ టేబుల్ ఈ దిశలో ఉండటం అసలు మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నైరుతి వైపు ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు కలుగుతాయి.

దక్షిణ దిశ (South):

దక్షిణంలో డైనింగ్‌ టేబుల్‌ ఉండటం వల్ల కుటుంబంలో వివాదాలు, ఆరోగ్యసమస్యలు, గొడవలు కలుగుతాయి. కాబట్టి ఈ దిశలో ఉంచడం మంచిది కాదు.

ఆగ్నేయ దిశ (South-East):

ఈ దిశలో డైనింగ్‌ చేయడం వల్ల తీవ్రమైన కోపం, ఆవేశం పెరుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ స్థలంలో ఉంచడం మంచిది కాదు.

అయితే ఇంట్లో డైనింగ్ టేబుల్‌ను ఎక్కడ ఉంచాలి అనే దానితో పాటు ఎలాంటి ఆకారంలో ఉండాలి అనే వివరాలు కూడా చాలా ముఖ్యం.

వాస్తు ప్రకారం డైనింగ్ టేబుల్ ఆకారంలో ఉండాలి:

వాస్తు నిపుణుల ప్రకారం, డైనింగ్‌ ఎల్లప్పుడు చతురస్ర Square ఆకారం లేదా దీర్ఘచతుర Rectangle, గుండ్రంగా Circle, గుడ్డు oval ఆకారంలో ఉండే టేబుల్‌ మంచిది. ఇలాంటి డైనింగ్‌ టేబుల్‌ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో సంతోషం, ఐక్యత, స్థిరత్వం ఉంటుంది. మీరు డైనింగ్ టేబుల్‌ కొనుగోలు చేసుకొనే ముందు ఈ ఆకారంలో ఉండే వాటిని తీసుకోండి.

చాలా మంది ముక్కోణపు ఇతర ఆకారాలు కొనుగోలు చేస్తుంటారు. ఇవి చూడడానికి ఆకర్షియంగా ఉన్నప్పటికి వాస్తు ప్రకారం మంచివి కావు. ఇలాంటి డైనింగ్‌ టేబుల్‌ ఉండటం వల్ల ఇంట్లో తరచు గొడవలకు దారి తీస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News