Tuesday, June 10, 2025
Homeచిత్ర ప్రభAkhanda2: ‘అఖండ 2’ టీజర్ గూస్ బంప్స్.. అదిరిపోయిన బాలయ్య లుక్

Akhanda2: ‘అఖండ 2’ టీజర్ గూస్ బంప్స్.. అదిరిపోయిన బాలయ్య లుక్

నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna)-బోయపాటి శీను కాంబోలో తెరకెక్కుతున్న ‘అఖండ2′(Akhanda2) చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ బ్లాక్ బాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అలాంటి మాస్ కాంబోలో వస్తుతన్న ‘అఖండ2’పై విపరీతమైన హైప్ నెలకొంది. తాజాగా బాలయ్య పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.

టీజర్(Akhanda2 Teaser) లో బాల‌య్య డైలాగ్స్‌తో అద‌ర‌గొట్టారు. ‘నా శివుడి అనుమ‌తి లేనిదే.. ఆ యముడే క‌న్నెత్తి చూడ‌డు.. నువ్వు చూస్తావా..’ అంటూ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ అదిరిపోయింది. ఇక బాలయ్య లుక్ , త‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించాయి. మొత్తంగా ఈ టీజ‌ర్‌తో చిత్రంపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగిపోయాయి.

ఇక ఈ సినిమాని బాలయ్య రెండో కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రగ్య జైస్వాల్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News