Thursday, June 12, 2025
HomeతెలంగాణMid Day Meal Scheme: తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకం మెనూ ఇదే

Mid Day Meal Scheme: తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకం మెనూ ఇదే

వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో 2025-26 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. అలాగే మధ్యాహ్న భోజన పథకం(Mid Day Meal Scheme) మెనూ కూడా రెడీ అయింది.

మధ్యాహ్న భోజన పథకం మెనూ:

సోమవారం- కిచిడీ + మిక్సిడ్ వెజిటబుల్ కర్రీ & గుడ్డు
మంగళవారం- రాగి జావ, అన్నం + సాంబార్ + మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ
బుధవారం- అన్నం + ఆకుకూర పప్పు + మిక్సిడ్ వెజిటబుల్ కర్రీ & గుడ్డు
గురువారం- రాగి జావ, వెజిటబుల్ బిర్యానీ + మిక్సిడ్ వెజిటబుల్ కర్రీ
శుక్రవారం- అన్నం + సాంబర్, మిక్సిడ్ వెజిటబుల్ కర్రీ & గుడ్డు
శనివారం- రాగి జావ/ అన్నం+ ఆకుకూరల పప్పు + మిక్సిడ్ వెజిటబుల్ కర్రీ

ఇక ఈ విద్యా సంవత్సరం మొత్తంలో విద్యార్థులకు 230 పనిదినాలను ఖరారు చేశారు. ఈ క్యాలెండర్‌లో బోధన సమయాలతో పాటు, సెలవులు, పరీక్షల తేదీలు, ఇతర ముఖ్యమైన కార్యకలాపాలను స్పష్టంగా పొందుపరిచారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా ఈ అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ క్యాలెండర్‌ ఆధారంగా తమ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. తాజాగా విడుదలైన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడుస్తాయి. ఇక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు కొనసాగనున్నాయి. పాఠశాలల్లో ప్రతి రోజు కనీసం 90 శాతం విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కఠిన ఆదేశాలు జారీ చేసింది.

2025-26 విద్యా సంవత్సర సెలవులు:

దసరా సెలవులు: సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు
క్రిస్మస్ సెలవులు: డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 27 వరకు
సంక్రాంతి సెలవులు: జనవరి 11, 2026 నుంచి జనవరి 15, 2026 వరకు
వేసవి సెలవులు: మార్చి 24 నుంచి జూన్ 11 వరకు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News