Monday, June 16, 2025
Homeచిత్ర ప్రభNivetha Thomas: కవ్వించే చీర కట్టుతో కుర్రకారు మతిపోగొట్టిన నివేదా థామస్‌!

Nivetha Thomas: కవ్వించే చీర కట్టుతో కుర్రకారు మతిపోగొట్టిన నివేదా థామస్‌!

Nivetha Thomas in Red saree: చాలా కాలం గ్యాప్ తర్వాత ‘35 చిన్న కథ కాదు’ సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు గానూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ అవార్డుల్లో (Telangana Gaddar Film Awards 2024) ఉత్తమ నటిగా ఎన్నికైంది. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆమె రెడ్ కలర్ చీరలో మెరిసింది. ఈ చీరకట్టులో ఆమె మొత్తం ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో ఆమెకు సంబంధించిన విజువల్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు ఆమె ‘35 చిన్న కథ కాదు’ చిత్రం తర్వాత ఏ ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కొంత కాలంగా ఆమె బిగ్ స్క్రీన్‌కి దూరంగా ఉన్నప్పటికీ ఆమె ఫ్యాన్స్ మాత్రం ఆమెను అనునిత్యం అనుసరిస్తూనే ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఫిలిం అవార్డుల ప్రధానోత్సవంలో అచ్చం తెలుగింటి సారీలో ఆమె కనువిందు చేశారు. అదే సినిమాకు అవార్డు తీసుకుంటున్న సమయంలో ఆమె ఆకట్టుకున్నారు. 

- Advertisement -

ఈ ఈవెంట్‌లో నివేదా ధరించిన రెడ్ కలర్ చీర దానిపై మెరిసే మెటీరియల్, సింపుల్‌ గా ఉంది. అలాగే ఆమె క్లాసీ మేకప్‌ లుక్‌ సైతం నెటిజన్లను ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలకు మంచి స్పందన లభిస్తోంది. కానీ ఇటీవల ఆమె సినిమాలు లేకపోవడం ఫ్యాన్స్‌ని కాస్త నిరాశపరించింది. తాజాగా ఆమె ఏదైనా ప్రైవేట్‌ లేదా ఇతర పంక్షన్స్‌ హాజరైతే చాలు అక్కడితో సంబురపడి పోతున్నారు. ఆమెను మళ్లీ తెరపై చూడాలనే ఆశతో ఎంతోమంది అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

నిన్న జరిగిన గద్దర్‌ ఫిలిం అవార్డుల వేడుకలో ఆమె పిక్స్‌ని, వీడియోలను ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. దీంతో ఆమె మరోసారి ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారారు. అంతే కాదు నివేదా సైతం సినిమాలకంటే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాను స్టైలిష్ ఫోటో షూట్స్‌తో అప్పుడప్పుడు ఫ్యాన్స్‌ని మంచి కిక్కు ఇచ్చే ఫోటో గ్యాలరీని విడుదల చేస్తుంటుంది. ఏదీ ఏమైనప్పటికీ ఆమె చాలా రోజుల తర్వాత మళ్లీ అందమైన చీరకట్టులో బయటకు రావడంతో ఫ్యాన్స్‌ మస్తు ఖుషీ అవుతున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News