Wednesday, June 18, 2025
Homeలైఫ్ స్టైల్Coconut hair oil: తలకు కొబ్బరినూనె ఎందుకు రాస్తారో తెలుసా..!

Coconut hair oil: తలకు కొబ్బరినూనె ఎందుకు రాస్తారో తెలుసా..!

మన పెద్దలంతా తలకు కొబ్బరి నూనెనె ఎందుకు అలవాటు చేశారో తెలుసా..? “ఇలా రా.. ఆ జుట్టుకు ఇంత కొబ్బరినూనె రాస్తా” అని తరచుగా మన వెంటపడటం మీరు వింటూ ఉంటారు. వారానికి 2 సార్లు కొబ్బరినూనె రాయడం అలవాటు చేసుకుంటే మంచి ఫలితాలు కనపడతాయని కూడా గమనించి కూడా ఉంటారు. అయితే ఈ లాభాలు ఎలా కలుగుతాయో మీకు తెలుసా.. కొబ్బరినూనె జుట్టు పెరుగుదలకు అసలు ఏ విధంగా సహాయ పడుతుందో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

తలకు కొబ్బరినూనె రాయడం వల్ల కలిగే ఉపయోగాలు:

1. జుట్టు పెరుగుదలకు సహాయం:

కొబ్బరినూనెలో లౌరిక్ యాసిడ్ (Lauric Acid) ఉండటంతో, అది తల చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి జుట్టు రూట్స్‌ను బలపరుస్తుంది.

2. జుట్టు ఊడిపోవడాన్ని తగ్గించటం:

కొబ్బరినూనె జుట్టును రక్షిస్తూ, దెబ్బతినకుండా చేస్తుంది. దీంతో జుట్టు కోల్పోకుండా ఉంటుంది.

3. తల చర్మానికి తేమ అందించడం:

ఇది తల చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీంతో జుట్టును పొడి, రఫ్‌గా మారకుండా కాపాడుతుంది.

4. తలలో చుండ్రు (dandruff) తగ్గిస్తుంది:

కొబ్బరినూనెలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటంతో అది చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది.

5. సహజ కండిషనర్:

కొబ్బరినూనె వాడటం వల్ల.. అది జుట్టుకు మెత్త దనాన్ని, ప్రకాశాన్ని ఇచ్చే సహజ కండిషనర్‌ గా పనిచేస్తుంది.

6. తలనొప్పి తగ్గించడంలో:.

కొబ్బరినూనెతో తలకి మర్దన చేయడం వలన రక్త ప్రసరణ మెరుగవుతుంది. అది తలనొప్పి తగ్గించడంలో సహాయ పడుతుంది.

7. వేడి తగ్గించడం:

వేసవి కాలంలో కొబ్బరినూనె తలపై రాసుకోవడం వల్ల అది వేడి తగ్గించడంలో సహాయపడుతుంది.

8. జుట్టు తెల్లబడటాన్ని తగ్గిస్తుంది:

కొబ్బరినూనె తరచుగా వాడటం వలన జుట్టు ఆరోగ్యంగా ఉండి, త్వరగా తెల్లబడకుండా చేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News