Thursday, June 19, 2025
HomeతెలంగాణTS RTC: పెరిగిన టికెట్ ధరలపై పురుష ప్రయాణికుల మండి పాటు..!

TS RTC: పెరిగిన టికెట్ ధరలపై పురుష ప్రయాణికుల మండి పాటు..!

తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన బస్ ధరలు అమల్లోకి రావడంపై ప్రయాణికులు మండి పడుతున్నారు. సామాన్య ప్రజలకు ప్రయాణం అంటే పెను భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికేఎక్స్ప్రెస్ సర్వీస్ ల కింద బస్సుల్లో రూ. 10 అదనంగా ఛార్జ్ చేస్తుండగా మళ్ళీ రూ. 10 పెంచడం అన్యాయమన్నారు.

- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ఆదాయం పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇటీవల మద్యం ధరల పెంపు పై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు తన దృష్టి ఆర్టీసీ వైపు పెట్టింది. జూన్ 9 న అంటే 10 రోజుల కింద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ రేట్లు భారీగా పెంచింది. 20 శాతానికి పైగా బస్ పాస్ రేట్లను పెంచినట్లు ప్రకటించింది. టోల్ గేట్లు ఉన్న మార్గాలలో.. ఒక్క టోల్ గేట్ కు రూ. 10 చొప్పున టికెట్ రేట్లను పెంచినట్లు పేర్కొంది. అయితే ఆ పెంచిన దానికన్నా ఒక టికెట్ మరో రూ. 10 దాకావసూలు చేస్తున్నారని, మరోసారి చార్జీలు పెంచడం ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. అయితే కి.మీ రేషనలైజేషన్ పేరిట ఈ టికెట్ ధరలు పెంచినట్లుగా సమాచారం. దీనిపై తెలంగాణ ఆర్టీసీ సంస్థ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

పురుషులపైనే భారం:

తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది ప్రభుత్వం. ఆది సంతోషించ దగ్గ విషయమే అయినప్పటికీ.. ఇలా పురుషులపై అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని కొంతమంది మగవాళ్ళంతా వాపోతున్నారు. పెంచిన టికెట్ల ధరలను వెంటనే తగ్గించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా పలువురు ఈ విషయంపై స్పందిస్తున్నారు. టికెట్ రేట్లు పెంపు అనేది సామాన్య ప్రజల రోజువారీ ప్రయాణ ఖర్చులను పెంచి, ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న వర్గాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది అంటున్నారు.

మరో వైపు బస్ పాస్ ధరలు కూడా పెరగడం పేద విద్యార్థులకు శాపం లా మారిందని అంటున్నారు. ఓ విద్యార్థికి సంబంధించి.. ఆర్డినరీ బస్‌ పాస్‌ ను: రూ.1,150 నుండి రూ.1,400కు పెంచింది ప్రభుత్వం. మరోవైపు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ పాస్‌ విషయం లో కూడా : రూ.1,300 నుండి రూ.1,600కు పెంచింది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం వస్తోన్న వ్యతిరేకతల దృష్ట్యా.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఏమైనా మార్చుకుంటుందో లేదో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News