Friday, June 20, 2025
Homeహెల్త్Harmfull Mansoon foods: వర్షాకాలంలో వీటిని అస్సలు తినకండి..!

Harmfull Mansoon foods: వర్షాకాలంలో వీటిని అస్సలు తినకండి..!

వేసవి ఎండల తీవ్రత నుంచి ఇప్పుడిప్పుడే ఉపశమనం లభిస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వర్షాకాలం.. ఇక ప్రారంభంమైంది. వేసవిలో మాత్రమే లభించే మామిడి పండ్లు ఈ జూన్ నెలలో కూడా ఇంకా మార్కెట్ లో అందుబాటులోనే ఉండటం మీరు గమనిస్తూనే ఉండవచ్చు. అయితే ఇప్పుడు మామిడి పండ్లు తినడం దాదాపు ఆరోగ్యానికి హానికరం. అవి పైకి చూడటానికి మాములుగానే ఫ్రెష్ గానే కనిపించినా.. లోపల మన కంటికి కనపడని పురుగులు అందులో ఉంటాయి. అవి తినడం వలన మనం అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఉండవచ్చు. అందుకే వాటిని మళ్ళీ వేసవి వచ్చే వరకు దూరం పెట్టడమే మంచిది.

- Advertisement -

మామిడి పండ్లే కాకుండా మరికొన్ని ఇతర ఆహారాలను కూడా వర్షాకాలంలో దూరంగా పెట్టడం మంచిది.వర్షాకాలంలో వాతావరణం చల్లగా, తడిగా ఉండటం వల్ల కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ వంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో కొన్ని ఫుడ్స్ తినడం తగ్గించడం మంచిది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

వర్షాకాలంలో తినకూడని ఆహార పదార్థాలు:

1. రోడ్ సైడ్/street food:

పానీ పూరి, చాట్, బజ్జీలు, బూరెలు వంటి ఫుడ్స్‌లో హైజీన్ లేకపోవడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి.

2. కడగని ఆకుకూరలు:

మట్టితో ఉండే ఆకుకూరలు (పాలకూర, మెంతి కూర, తోటకూర, గోంగూర) వంటివి శుభ్రంగా కడగకపోతే జీర్ణ సమస్యలు కలుగుతాయి.

3. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్‌లు:

చల్లగా ఉండే ఈ పదార్థాలు గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలు కలిగిస్తాయి. అందుకే చల్లటి పదార్థాలకు కాస్త దూరంగా ఉండటం బెటర్.

4. పాత పెరుగు:

పెరుగును రోజుల తరబడి ఫ్రీజ్ లో పెట్టుకుని తినడం మంచిది కాదు. పాత పెరుగును ఎక్కువగా తీసుకుంటే తడిగా ఉండే వాతావరణంలో జీర్ణక్రియ మందగిస్తుంది.

5. సీ ఫూడ్ (Seafood):

వర్షాకాలంలో చేపలు, రొయ్యలు సరిగ్గా శుభ్రంగా ఉండకపోవచ్చు. ఫ్రెష్‌గా లేనివి తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఉండవచ్చు.

6. కడుపునిండా తినడం:

వేసవి తో పోలిస్తే వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ స్లోగా పని చేస్తుంది. కాబట్టి ఏ ఆహారాన్నైనా మితంగా తింటే బెటర్.

7. నిల్వ ఉంచిన పదార్ధాలు:

ప్యాకెజ్డ్ స్నాక్స్, చిప్స్, పఫ్‌లు మొదలైనవి బాక్టీరియా వృద్ధికి అవకాశం కల్పిస్తాయి. వీటిని తినవద్దు.

సూచనలు:

  • – శుభ్రంగా కడిగి ఉడికించిన ఆహారం మాత్రమే తీసుకోవాలి.
  • – నెమ్మదిగా జీర్ణమయ్యే, తేలికపాటి ఆహారం (ఉప్మా, కిచిడీ, తక్కువ ఆయిల్ వేసి చేసిన వేపుడు కూరలు వంటివి) మేలు.
  • -వీటితో పాటు ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారమే బెటర్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News