Saturday, June 21, 2025
Homeటెక్నాలజీPasswords Data Leak: సైబర్ నేరగాళ్ల వలలో 16 బిలియన్ల యాపిల్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌ పాస్‌వర్స్డ్‌...

Passwords Data Leak: సైబర్ నేరగాళ్ల వలలో 16 బిలియన్ల యాపిల్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌ పాస్‌వర్స్డ్‌ డేటా

Passwords Leak: యాపిల్, గూగుల్, ఫేసుబుక్, టెలిగ్రామ్ వంటి మెగా సంస్థలలో సుమారు 16 బిలియన్ల యూజర్ల డేటా లీక్ అయినట్టు సైబర్ భద్రత పరిశోధకులు వెల్లడించారు. ప్రస్తుత యుగం ఆధునిక సాంకేతికత వల్ల ఎన్నో విధాలుగా ముందంచులో ఉన్నపటికీ అదే సాంకేతికత వల్ల భారీ నష్టాన్ని కూడా చవి చూడాల్సి వస్తుంది. సైబర్ నేరగాళ్ళకి ఈ సాంకేతికత ఒక బ్రహ్మాస్త్రం లాగా ఉపయోగపడుతుంది, ఎప్పటికి అప్పుడు సైబర్ నేరగాళ్లు కొత్త డిజిటల్ పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. దీంతో సైబర్ నేరాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా చోటు చేసుకుంటున్నాయి.

ఎన్నో ప్రముఖ కంపెనీల దాటని కూడా ఈ సైబర్ నేరగాళ్లు చాలా సులువుగా దోచుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరుకు జరిగిన సైబర్ డేటా చోరిలో ఇదే అతి పెద్ద డేటా లీక్ అని పేర్కొన్నారు. మే 23న ఫోర్బ్స్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం యాపిల్, గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్ ఇలా ప్రముకమైన ఎన్నో మెగా కంపెనీల డేటా చోరీకి గురైందని ప్రభుత్వ మరియు ప్రైవేట్ వెబ్ సైట్ల యూజర్ లాగిన్ డేటా, పాస్‌వర్డ్‌ సైతం సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. 

గతంలో ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థకు చెందిన 184 మిలియన్ల యూజర్ల లాగిన్ వివరాలకు సంబంధించిన డేటా సైబర్ నేరగాళ్లు హ్యాక్‌ చేశారని సైబర్ పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 16 బిల్లియన్లకు చేరిందని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెళ్లడించాయి. నివేదికల ప్రకారం సైబర్ భద్రత పరిశోధకుల సుమారు 30 డేటా సైట్లను కనుగొనగా.. ఒక్కో డేటా సైట్‌లో 3 బిలియన్ల డేటా రికార్డులు ఉన్నట్టు గుర్తించారు. సోషల్ మీడియా మరియు ఇతర కార్పొరేట్ సంస్థలకు చెందిన అన్ని ఖాతాలలో 2025 నుంచి లాగిన్  రికార్డులు అన్ని ఈ డేటా సెట్ల ద్వారా సైబర్ నేరగాళ్లు చోరీకి పాలుపడ్డారు.

- Advertisement -

ఈ విధమైన డేటా ఉల్లంఘన నుంచి తప్పించుకోవడానికి గూగుల్ తమ వినియోగదారులకు పాత సైన్ ఇన్ పద్దతులను పూర్తిగా మార్చివేసింది. కొత్తగా బయోమెట్రిక్ మరియు ఫేస్ అన్ లాక్ పద్ధతులలో మాత్రమే వినియోగదారుల ఖాతాలను మెయిల్  ద్వారా భద్రతా అప్డేట్ చేసుకోవాల్సిందిగా సలహాలు ఇస్తోంది. ఇందులో భాగంగా సైబర్ భద్రత పట్ల ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సోషల్ సైన్ ఇన్ మరియు పాస్ కీలను అప్డేట్ చేస్కుకోవాల్సిందిగా ఒత్తిడి చేస్తుంది. ఈ విధమైన భద్రత అప్డేట్ వలన వినియోగదారుల డేటా సైబర్ నేరగాళ్ల చోరీకి గురికాకుండా.. హ్యాకర్ల నుంచి డేటాను భద్రపరుస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News