Saturday, June 21, 2025
Homeలైఫ్ స్టైల్Natural Face Beauty Tips: ముఖ సౌందర్యం కోసం సహజమైన చిట్కాలు..!

Natural Face Beauty Tips: ముఖ సౌందర్యం కోసం సహజమైన చిట్కాలు..!

Natural Face Beauty Tips: అందం అంటే కేవలం రంగు కాదు, ఆరోగ్యంగా ఉండే ముఖం.. ఓ నిజమైన అందం. సహజమైన మార్గాలను అనుసరించి, ముఖాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మీరు ప్రతిరోజూ ప్రకాశవంతంగా కనిపించవచ్చు. ముఖం మన వ్యక్తిత్వానికి అద్దం లాంటిది. అందంగా కనిపించడం కేవలం మేకప్ మీద ఆధారపడి ఉండకూడదు, అది ఆరోగ్యంగా ఉన్న చర్మంతో ప్రారంభమవుతుంది. ముఖం ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సహజమైన చిట్కాలను అనుసరించడం అవసరం.

- Advertisement -

ముఖ సౌందర్యానికి ముఖ్యమైన సూచనలు:

1. శుభ్రత:

మనం రోజు బయట తిరుగుతూ ఉంటాం. బయట అంతా దుమ్ము, కాలుష్యం వలన చర్మం మొటిమలు, చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి రోజుకు కనీసం రెండు సార్లు ముఖాన్ని మైల్డ్ క్లీన్సర్ తో కడుక్కోవాలి.

2. తేమను నిలుపుకోవడం (Moisturizing):

మన చర్మ రకాన్ని బట్టి సరైన మాయిశ్చరైజర్ ను వాడాలి. ఇది చర్మాన్ని పొడి బారకుండా చేస్తుంది.

3. సన్ స్క్రీన్ వాడటం:

బయటకు వెళ్లేటప్పుడు మన స్కిన్ కు సరి పడే SPF ఉన్న సన్ స్క్రీన్ ను తప్పకుండా వాడాలి. ఇది చర్మాన్ని UV కిరణాల నుంచి కాపాడుతుంది.

4. మంచి ఆహారం:

మనం తినే తిండి కూడా ముఖ సౌందర్యం లో ముఖ్యమైన పాత్ర నే పోషిస్తుంది. ఆహారంలో పండ్లు, కూరగాయలు, పొట్టు పిండి తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్ A, C, E ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. ముఖ కాంతిని పెంచుతుంది.

5. నీటి త్రాగుట:

నీరు కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగడం వల్ల చర్మం హైడ్రేట్‌ గా ఉంటుంది. టాక్సిన్లు చమట రూపం లో బయటకు వెళ్లి పోయి ముఖం తళతళలాడుతుంది.

6. సరిగ్గా నిద్రపోవడం:

సరైన నిద్ర తప్పనిసరి. రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర పోవాలి. నిద్ర తక్కువగా ఉన్నప్పుడు ముఖం ముంగుర్లు, మలినంగా కనిపిస్తుంది.

7. సహజమైన ప్యాక్‌లు వాడటం:

ముఖానికి శనగ పిండి, పెరుగు కలిపి పేస్ ప్యాక్ లాగా వేసుకుంటే చాలా ఉపయోగమంటుంది. చర్మం మంతా నిగనిగ లాడుతూ ప్రకాశవంతంగా మెరిసి పోతుంది.

అలాగే తేనె లో కాసంత నిమ్మరసం కలిపి ముఖానికి రాస్తే.. ముడతలు, మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది.

అలొవెరా జెల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దీనిని ముఖానికి అప్లై చేస్తే.. చర్మానికి తేజాన్ని ఇస్తుంది, శీతలీకరణ ప్రభావం ఉంటుంది.

8. రాత్రి పూట మేకప్ తీసేయడం:

రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా మేకప్ తీసేయాలి. లేకపోతే రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు వస్తాయి.

గమనిక:

ఇవన్నీ.. ఒకటి రెండు రోజులు కాకుండా క్రమంగా మీ ముఖంలో మార్పులు వచ్చే వరకు చేస్తూ ఉండాలి. ఆ తర్వాతా అప్పుడప్పుడు శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News