!Ts weather updates: జూలై 1వ వారం వరకు హైదరాబాద్‌తో సహా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు తక్కువేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రైతులు తమ పంటలకు ప్రత్యామ్నాయ నీటి అవసరాలను తీర్చుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
మరోవైపు నిన్నటిలాగే, ఈరోజు కూడా.. సాయంత్రం, రాత్రి సమయాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈరోజు గణనీయమైన లేదా భారీ వర్షాలు ఉండవని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఇది హైదరాబాద్‌కి కూడా వర్తిస్తుందని తెలిపింది.
నిన్న నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో 20-30 నిమిషాల పాటు మోస్తరు వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటితో పాటు జనగామ, వికారాబాద్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసినట్లు వెల్లడించింది.
నిన్నటితో పోలిస్తే నేడు హైదరాబాద్ లో సాయంత్రం నుంచి రాత్రి సమయంలో కాస్త తక్కువగా చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించి. దాంతో పాటు రాష్ట్రంలోని ఇతర చోట్ల కూడా వాతావరణం చల్ల బడి అక్కడక్కడా చిరు జల్లులు కురుస్తాయని తెలిపింది.
రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని పేర్కొంది. పశ్చిమ నైరుతి దిశల నుంచి 30 నుంచి 40 కీ.మీ వేగంతో వీస్తున్న గాలుల వల్ల అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. మరో రెండు వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతోందని తెలిపింది. మధ్య భారతదేశంలో ఎల్ పీ ఏ బలపడటం వలన ఈ నెల 23 నుంచి తెలంగాణలో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ముందుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నట్లు తెలిపింది.
జులై మొదటి వారం నుంచి:
నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దేశం మొత్తం విస్తరించాయి. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జులై మొదటి వారంలో రుతుపవనాల జోరు మరింత పెరగనుందని భారత వాతావరణ కేంద్రం కూడా తెలిపింది. ఆ తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.