Electric Scooters: ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. మార్కెట్లో అనేక కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనడానికి వెనుకాడుతున్నారు. దీనికి ప్రధాన కారణం దానికి ఉండే తక్కువ రేంజ్. దీంతో ప్రజలు ఎక్కువగా పెట్రోల్ స్కూటర్లను కొనడానికి మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుదారులకు రేంజ్ ఒక పెద్ద సమస్య అవుతోంది. ఇటువంటి పరిస్థితిలో దాదాపు 150 కి.మీ వరకు రేంజ్ తో వచ్చే ఎలెక్ట్రిక్ స్కూటర్ల గురించి ఈ వార్తలో చూద్దాం.
ఓలా S1 ప్రో
ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్లో పెద్ద మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఓలా ఎలక్ట్రిక్ అనేక మోడళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాగా, ఓలా S1 ప్రో మాత్రం ఎక్కువ రేంజ్ ఇస్తుంది. సింగల్ ఛార్జ్ తో దాదాపు 176 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఇందులో అనేక బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. అయితే, టాప్ బ్యాటరీ ఉన్న వేరియంట్ 320 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే.. దీని గరిష్ట వేగం గంటకు 117 కి.మీ. ఈ స్కూటర్ 7.15 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.30 లక్షలుగా ఉంది. ముందు భాగంలో డిస్క్ బ్రేక్ ఇచ్చారు. కాగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు 3 సంవత్సరాల వారంటీతో కొనుగోలు చేయొచ్చు.
బజాజ్ చేతక్ 3501
బజాజ్ చేతక్ 3501 ఎలక్ట్రిక్ స్కూటర్ సింగల్ ఛార్జ్ తో 153 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. దీనికి 3.5 kWh బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. కాగా, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.39 లక్షలుగా ఉంది. ఈ స్కూటర్లో 35 లీటర్ల బూట్‌స్పేస్‌ను అందించారు. ఇది టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో కూడా వస్తుంది. దీనితో పాటు ఇంటిగ్రేటెడ్ మ్యాప్‌లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. అంతేకూండా డాక్యుమెంట్ స్టోరేజ్ కూడా సపోర్ట్ చేయబడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 73 కి.మీ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 5-లీటర్ గ్లోవ్ బాక్స్ కూడా అందుబాటులో ఉంది. కీలెస్ యాక్సెస్, ఓవర్‌స్పీడ్ అలర్ట్ ఫీచర్ కూడా ఉంది. ఈ స్కూటర్లో హిల్ హోల్డ్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్, మ్యాప్ నావిగేషన్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
సింపుల్ వన్
కంపెనీ మార్చి 2025లో సింపుల్ వన్ఎస్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.39 లక్షలుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 181 కి.మీ. రేంజ్ ఇస్తుంది. కంపెనీ ఈ కొత్త స్కూటర్లో స్మార్ట్ మొబిలిటీని అందించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ ఎనర్జీ 15 షోరూమ్‌లలో అందుబాటులో ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 105 కి.మీ. దీనికి 4 రైడింగ్ మోడ్లు ఉన్నాయి. ఇందులో ఎకో, రైడ్, డాష్, సోనిక్ ఉన్నాయి. కాగా, ఈ స్కూటర్ కేవలం 2.55 నిమిషాల్లో 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
టీవీఎస్ ఐక్యూబ్
150 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే మరో ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కి.మీ. రేంజ్‌ను ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.06 లక్షలుగా ఉంది. ఇది 4.4 కిలోవాట్ల శక్తిని, 140 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 75 కి.మీ. వారంటీ గురించి మాట్లాడుకుంటే దీనికి 3 సంవత్సరాలు లేదా 50,000 కి.మీ. వారంటీ లభిస్తుంది. ఇది 4.2 సెకన్లలో 0-40 వేగాన్ని అందుకోవడం విశేషం.
ఏథర్ రిజ్టా
కంపెనీ మొట్టమొదటి ఫ్యామిలీ స్కూటర్ ఏథర్ రిజ్టా. ఇది ఒకే ఛార్జ్‌లో 160 కి.మీ. పరిధిని ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కి.మీ. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 5 సంవత్సరాల వారంటీతో కొనుగోలు చేయొచ్చు. ఈ స్కూటర్ సీటు కింద 34 లీటర్ల బూట్ స్పేస్ , 22 లీటర్ల ముందు స్పేస్‌ను కలిగి ఉంటుంది.