Carrot uses: క్యారెట్ మార్కెట్ లో విరివిగా లభించే ఐటమ్. క్యారెట్ వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయి. రోజుకు ఒక క్యారెట్ తినడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. క్యారెట్ వల్ల దృష్టి శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్ A (బీటా కేరోటిన్) అధికంగా ఉండటంతో కళ్ళకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ పదార్థం జీర్ణ వ్యవస్థకు సహకరిస్తుంది. అలాగే క్యారెట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిపించడంలో సహకరిస్తాయి.
క్యారెట్ లోని కొన్ని పోషకాలు రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. అలాగే ఇందులోని పొటాషియం, ఫైటోన్యూట్రియంట్లు గుండెకు మేలు చేస్తాయి. మరో వైపు చర్మ వ్యాధులను నివారించడంలో సహాయం చేస్తుంది. ఇందులోని విటమిన్ C చర్మాన్ని రక్షించడంలో సహాయ పడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారక కణాల ఏర్పడకుండా అడ్డుకుంటాయి.
క్యారెట్ లోని విటమిన్ C ఇతర పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఇది బరువు తగ్గే వారికి మంచిది. తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ కలిగి ఉండటం వల్ల వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది.
క్యారెట్ ను రోజు ఒక మంచి స్నాక్ గా.. ముక్కలుగా కోసి తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండచ్చు. అలాగే క్యారెట్ తో ఎన్నో రుచికరమైన రెసిపీలు కూడా చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- క్యారెట్ సాలడ్ (Carrot Salad):
కావలసిన పదార్థాలు:
క్యారెట్ తురిమినది – 1 కప్పు
ఉల్లిపాయ సన్నగా – 1
నిమ్మరసం – 1 టీస్పూన్
మిరియాల పొడి – ½ టీస్పూన్
ఉప్పు – తగినంత
తయారీ విధానం:
అన్ని పదార్థాలను కలిపి బాగా మిక్స్ చేయాలి.
ఇది చాలా ఆరోగ్యకరమైన స్నాక్. భోజనానికి ముందు స్టార్టర్ లా తినవచ్చు.
- క్యారెట్ జ్యూస్ (Carrot Juice):
కావలసినవి:
క్యారెట్ లు – 5
తులసి లేదా పుదీన ఆకులు– కొన్ని
నిమ్మరసం – 1 టీస్పూన్
తేనె – 1 టీస్పూన్ (కావాలనుకుంటే)
తయారీ విధానం:
క్యారెట్ ను ముక్కలుగా కట్ చేసి జ్యూసర్‌లో వేసి రసం తీసుకోవాలి. మిగతా పదార్థాలు కలిపి సర్వ్ చేయాలి.
- క్యారెట్ పచ్చడి:
కావలసినవి:
క్యారెట్ తురిమినవి – 1 కప్పు
ఉప్పు, మిర్చి, వెల్లుల్లి – తగినంత
నూనె, ఆవాలు, జీలకర్ర – తాలింపు కోసం
తయారీ విధానం:
మిక్సీలో మిర్చి, వెల్లుల్లి, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. క్యారెట్ తో కలపండి. తాలింపు వేసి కలిపితే క్యారెట్ పచ్చడి రెడీ.
- క్యారెట్ సూప్ (Carrot Soup):
కావలసినవి:
క్యారెట్ – 2 (ముక్కలుగా)
ఉల్లిపాయ – 1
వెల్లుల్లి – 2 గింజలు
ఉప్పు, మిరియాల పొడి
నీరు తగినంత.
తయారీ విధానం:
బాణలిలో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ, వెల్లుల్లి వేయించండి. తర్వాత క్యారెట్ వేసి 2–3 నిమిషాలు వేపండి. నీరు వేసి మృదువుగా ఉడికించాలి. చివరగా మిక్సీలో వేసి సూప్‌లా తయారుచేసుకోవాలి.
- క్యారెట్ రైస్ (Carrot Rice):
కావలసినవి:
అన్నం – 1 కప్పు
క్యారెట్ తురిమినది – ½ కప్పు
మిరపకాయ, జీలకర్ర, ఉల్లిపాయ
నూనె, ఉప్పు
తయారీ విధానం:
నూనెలో జీలకర్ర, మిరపకాయలు వేయించి ఉల్లిపాయ వేసి వేయించాలి. తురిమిన క్యారెట్ వేసి వేపాలి. అన్నం వేసి బాగా కలపాలి.