Sunday, June 22, 2025
Homeచిత్ర ప్రభkubera movie: కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న కుబేర..!

kubera movie: కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న కుబేర..!

Latest Kubera collections: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రధారులుగా నటించిన కుబేర సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకు పోతోంది. సునీల్ నారంగ్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించే లాగే కనిపిస్తోంది. డీఎస్పీ అందించిన పాటలు, చిత్రం విడుదలకు ముందు రిల్జీ అయిన ట్రాన్స్ ఆఫ్ కుబేర, టీజర్, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి.

- Advertisement -

సినిమాలో ధనుష్ చేసిన బిచ్చగాడి పాత్రకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఏ తెలుగు నటుడు కూడా సాహసం చేయలేని పాత్రను ఒప్పుకున్నప్పుడే ధనుష్ సగం సక్సెస్ అయ్యాడని అంటున్నారు. మరోవైపు నాగార్జున కూడా కొత్త రోల్ లో మెరిసి ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన నేషన్ క్రష్ రష్మిక కూడా ఇందులోని సహజమైన పక్కింటి అమ్మాయి పాత్రను పోషించి ఆడియన్స్ ను మళ్ళీ కారు.

కుబేర మూవీ బాక్సాఫీస్‌ వసూళ్లు:

ప్రీమియర్ & ఓవర్సీస్ కలెక్షన్స్:

ఓవర్సీస్లో విడుదల ప్రారంభంలోనే మిలియన్ డాలర్లకు దగ్గరగా వసూలు చేసింది ఈ సినిమా. ఇది శేఖర్ కమ్ముల కెరీర్‌లో అత్యుత్తమ ఓపెనింగ్‌గా మారే అవకాశాన్ని చూపుతోంది. అలాగే కుబేర కు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చిన మొత్తం సుమారు 7–9 కోట్లు మధ్యగా ఉంటాయని ట్రేడ్ అంచనా.

ఇక ప్రస్తుతం విషయానికొస్తే.. సినిమా ఒకే రోజు రూ. 30 కోట్లు గ్రాస్‌ కలెక్షన్స్ సాధించినట్లు చిత్రబృందం వెల్లడించింది.

తొలి రోజు ఏరియా వైజ్ కలెక్షన్స్:

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు రూ. 58.9 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసిందని తెలియజేసింది.

నైజాం (తెలంగాణ) – రూ. 12 కోట్లు

సీడెడ్ (హైదరాబాద్) – రూ. 4 కోట్లుఉత్తరాంధ్ర – రూ. 4 కోట్లు

ఈస్ట్ గోదావరి – రూ. 2.2 కోట్లు

వెస్ట్ గోదావరి – రూ. 2 కోట్లు

కృష్ణా – రూ.2.05 కోట్లు

నెల్లూరు – రూ.1.2 కోట్లు

మొత్తం AP & TG : రూ. 30 కోట్లు

తమిళనాడులో – రూ. 15 కోట్లు

కన్నడ, మలయాళం, నార్త్ ఇండియా – రూ. 6 కోట్లు

ఓవర్సీస్ – రూ. 8 కోట్లు

థియేట్రికల్ బ్రేక్ ఈవెన్:

బ్రేక్ ఈవెన్ కోసం రూ. 120 కోట్లు గ్రాస్ వసూలు కుబేర కు అవసరం. ప్రస్తుత మొత్తం సుమారు రూ. 59 కోట్లు మాత్రమే. మొత్తంగా సినిమా మొదటి రోజే ఆకట్టుకున్నప్పటికీ, దీర్ఘకాలిక విజయానికి వీకెండ్ లో మౌత్‑టాక్ కీలకం కానుండగా.. రెండో రోజు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. సెలవు కావున ఈరోజు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News