Sunday, June 22, 2025
Homeచిత్ర ప్రభKannappa - Brahmanandam :‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. సెంటరాఫ్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచిన బ్ర‌హ్మానందం

Kannappa – Brahmanandam :‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. సెంటరాఫ్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచిన బ్ర‌హ్మానందం

Kannappa Pre Release Event: సీనియర్ స్టార్ కమెడియన్ అయిన బ్రహ్మ బ్రహ్మానందం మంచు మోహన్ బాబు మీద చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మోహన్ బాబు పెద్ద కొడు సినీ హీరో మా అధ్యక్షుడు అయిన మంచు విష్ణు కన్నప్ప చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ జె.ఆర్.సీ కన్వెన్షన్ లో గ్రాండ్ గా నిర్వహించారు.

- Advertisement -

ఈ గ్రాండ్ ఈవెంట్ లో కన్నప్ప సినిమాలో నటించిన నటీనటులు పాల్గొన్నారు. వీరిలో సినిమాలో నటించిన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ, కన్నప్ప సినిమా చేయాలని అనుకుంటే జరిగేది కాదని ఆ శివుడే మోహన్ బాబుని పిలిచి తీయమని చెప్పాడని బ్రహ్మానందం మాట్లాడుతూ అన్నారు. మోహన్ బాబు ఇప్పటికే చాలా సినిమాలు తీశారు. కానీ కన్నప్ప మూవీ కోసం బడ్జెట్ చాలా కేటాయించారు.

ఇంత జరగడానికి కారణం ఆ శివుడే అన్నారు. గత కొంతకాలంగా జనాల్లో తగ్గిపోయిన భక్తి తత్వాన్ని, శివతత్వాన్ని అందరికీ తెలియచేసేలా కన్నప్ప సినిమా ఉంటుంది. ఇప్పుడున్న మనుషులు చాలా భయంకరంగా ఆలోచిస్తున్నారు. అలాంటి వారికి భక్తి గురించి తెలియాలనే కన్నప్ప సినిమా తీశారని అన్నారు. మోహన్ బాబు ఏం చేసినా మీరు వదిలేయండి.. ఆయన్ను విమర్శించండి.. ఆయన నటనని విమర్శించండి.. ట్రోల్ చేయండి తప్పులేదు. కానీ భక్తి కోసం శివతత్వం తెలియపరచడం కోసం చేసిన ఈ సినిమాను మాత్రం ట్రోల్ చేయకండి అని హాస్య బ్రహ్మ అన్నారు. అందరికీ నమస్కరించి చెబుతుంది ఒకటే, కన్నప్ప సినిమా ఆదరించండి.. అభిమానించండి.. కానీ అల్లరి మాత్రం చేయకండి..అని అన్నారు బ్రహ్మానందం.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/dhanush-nagarjuna-rashmika-kubera-movie-1st-day-collections/

శివుడు ప్రతి ఇంటా చేరాలి, ప్రతి గుండెని తాకాలనే కన్నప్ప సినిమాను తీశారు. ఇదే సందర్భంగా దూర్జటి గురించి ప్రస్తావించారు. ఇక బ్రహ్మానందం మాట్లాడకముందే సుమ వెళ్లి మోహన్ బాబు గారి సినిమాల్లో మీరు చేయాల్సి వస్తే ఏ సినిమా చేస్తారని అడిగారు. అసెంబ్లీ రౌడీ అని బ్రహ్మీ అన్నారు. ఈ కథ ముందు నా దగ్గరకే వచ్చింది. కానీ, మోహన్ బాబు వచ్చి నన్ను అడిగాడు..ఈ సినిమా నేను తీస్తా అని.. అందుకే ఇచ్చేశా అన్నారు. అలాగే, మోహన్ బాబులో నచ్చే రెండు విషయాలు ఏంటని అడిగితే అసలు మోహన్ బాబు అంటేనే నచ్చడు.. అని సరదాగా చెప్పారు బ్రహ్మానందం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News