Vishnu Manchu – Prabhas: మంచు విష్ణు నటించి నిర్మించి పాన్ ఇండియా సినిమా కన్నప్ప. అతి త్వరలో భారీగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎంతో ఘనంగా హైదరాబాద్ జె.ఆర్.సీ కన్వెన్షన్ లో నిర్వహించారు. ఈ గ్రాండ్ ఈవెంట్ కి చిత్ర యూనిట్ అంతా పాల్గొంది. ఈ సందర్భంగా నటుడు నిర్మాత మంచు విష్ణు మాటలు ఆడియన్స్ని బాగా అలరించాయి. కన్నప్ప కథ 2014 లో తన దగ్గరకు వచ్చిందని.. ఆ తర్వాత రైట్స్ తీసుకున్నట్లు చెప్పారు. కన్నప్ప సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి ఓ నటుడు ఉండాలని రాసుకున్నా.. అలాగే జరిగింది. శివానుగ్రహం ఉండటం వల్ల అలా కుదిరింది అన్నారు. కన్నప్ప నా సినిమా కాదు.. కన్నప్ప సినిమా. ఈ సినిమా చూసినప్పుడు ఇంత పెద్ద సినిమా తీశామా.? ఇందులో నేను నటించానా..? అనిపించింది. శివయ్య ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యమైంది అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.
కన్నప్ప చిత్రానికి స్టీఫెన్ దేవసీ అద్భుతమైన సంగీతం అందించారు. 2017లో స్టీఫెన్ ఈవెంట్ ఒకటి చూశాను. కన్నప్ప సినిమా ఎప్పుడు మొదలైనా మీరే చేయాలని చెప్పా. ఇందులో నటించిన మోహన్ లాల్ గారు గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్షయ్ కుమార్ గారికి థాంక్స్. ఇక శరత్ కుమార్ గారితో మంచి బాండింగ్ ఉంది. ఆయనతో ఎన్నో ఏళ్లుగా సినిమా చేయాలని అనుకున్నాను. అది కన్నప్పతో నెరవేరింది. తమిళ్ లో కన్నప్ప రిలీజ్ కు ఆయన చాలా సహాయం చేశారు..అని విష్ణు తెలిపారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/brahmanandam-speech-viral-in-kannappa-pre-release-event/
ఇదే సమయంలో మంచు విష్ణు.. స్నేహితులు రెండు రకాలు. కృష్ణుడిలా కొందరు.. కర్ణుడిలా కొందరు ఉంటారు. నీ పక్కనే ఉంటూ నీకు దారి చూపిస్తాడు కృష్ణుడు. నా జీవితంలో కృష్ణుడు ప్రభాస్ అని చెప్పారు విష్ణు. కర్ణుడిగా నీ వెనక ఎప్పటికీ ఉంటా ప్రభాస్ అని కృతజ్ఞతలు తెలిపాడు. ఇండస్ట్రీలో కాస్త పేరొచ్చినా మారిపోతారు. ప్రపంచంలోనే బిగ్ స్టార్.. అయినా మేమిద్దరం మొదటిరోజు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాము. ప్రభాస్ ఇది నువ్వు చూస్తున్నవ్.. నా జీవితంలో కృష్ణుడు నువ్వు.. నీ జీవితంలో నేను కర్ణుడిని అని విష్ణు ఎమోషనల్ అయ్యాడు. అందరి బ్లెస్సింగ్స్ వల్ల కన్నప్ప సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఇది పరమశివుడి అనుగ్రహంతో తీసిన సినిమా అని మంచి విష్ణు చెప్పారు.