Monday, June 23, 2025
HomeదైవంAashadha Amavasya 2025: అషాఢ అమావాస్య రోజు ఇలా చేస్తే.. మీకు డబ్బే డబ్బు, లగ్జరీ...

Aashadha Amavasya 2025: అషాఢ అమావాస్య రోజు ఇలా చేస్తే.. మీకు డబ్బే డబ్బు, లగ్జరీ లైఫ్..

Aashadha Amavasya 2025 Date and Time: హిందూశాస్త్రాల ప్రకారం, అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. కొంత మంది అమావాస్యను అశుభకరంగా భావిస్తారు. చాలా పనులు వాయిదా వేసుకుంటారు. అయితే అమావాస్యల్లో ఆషాడ అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజున పితృదేవతలకు తర్పణాలిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరడంతోపాటు తద్వారా వంశ వృద్ధి జరుగుతుందని నమ్మకం. అంతేకాకుండా జనన, మరణాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతారు. అయితే ఈ ఏడాది ఆషాడ అమావాస్య ఎప్పుడు వచ్చింది, దాని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -


అషాఢ అమావాస్య శుభ ఘడియలు
ఈ సంవత్సరం ఆషాడ అమావాస్య జూన్ 25 అంటే బుధవారం నాడు వస్తుంది. అయితే ఇది ఈ నెల 24 ఉదయం 6:59 గంటలకు ప్రారంభమై.. తర్వాత రోజు సాయంత్రం 4గంటలకు ముగుస్తుంది. ఎల్లుండి సూర్యోదయం 5:25కు, సూర్యస్తమయం 7:23కు అవుతుంది. బ్రహ్మముహూర్తం ఉదయం 4:05 గంటలకు మెుదలై 4:45 వరకు ఉంటుంది. విజయ ముహూర్తం మధ్యాహ్నాం 2:43 నుంచి 3:39 వరకు ఉంటుంది. గోధూళి ముహూర్తం రాత్రి 7:21 నుంచి 7:42 వరకు కొనసాగుతుంది. అమృత కాలం అర్ధరాత్రి 11:34 నుంచి తర్వాత రోజు 1: 02 వరకు ఉంటుంది.


ఆషాఢ అమావాస్య విశిష్టత
ఈ ఆషాఢ అమావాస్యనే భీమ అమావాస్య జ్యోతిర్బీమేశ్వర అమావాస్య అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ అమావాస్యను శక్తివంతమైనదిగా, శుభప్రదమైనదిగా భావిస్తారు.ఈ రోజున చనిపోయిన పూర్వీకులకు పిండ ప్రదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాకుండా అర్హులైన బ్రాహ్మణాలకు లేదా అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. దీంతోపాటు పప్పులు, బియ్యం, అరటిపళ్లు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.
ఈరోజు ఉదయాన్ని ఇల్లుని శుభ్రం చేసి దీపాలు వెలిగించడం వల్ల మీ ఇంట్లోకి పాజిటివిటీ వస్తుంది. ఈ అమావాస్యనాడు పార్వతీపరమేశ్వరులను నిష్టగా పూజించడం వల్ల మీ వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. దీంతోపాటు పక్కనే ఉన్న గుడికి వెళ్లి అక్కడ రావిచెట్టు కింద దీపం వెలిగించడం వల్ల మీ లైఫ్ లో సుఖసంతోషాలు వెల్లివిరిస్తాయి. ఇష్టదైవాన్ని ప్రార్థించడం వల్ల కూడా మీకు మేలు జరుగుతుంది.


ఏ పనులు చేయకూడదు?
ఈ ఆషాఢ అమావాస్య రోజుల మాంసాహారం తినకండి. స్నానం చేయకుండా పూజలో కూర్చోకండి. ఈరోజున కోపాన్ని వీడి శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ పితృలను తలుచుకోకుండా దానాలు చేయకండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News