Monday, June 23, 2025
HomeఆటRishabh Pant Umpire Fight: అంపైర్‌తో గొడవ.. రిషబ్‌ పంత్‌పై ఐసీసీ వేటు?

Rishabh Pant Umpire Fight: అంపైర్‌తో గొడవ.. రిషబ్‌ పంత్‌పై ఐసీసీ వేటు?

ICC Serious on Rishabh Pant: ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ఈ టెస్ట్‌లో మూడో రోజు ఆటలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) మైదానంలో అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రిషబ్‌ని మందలించే అవకాశం ఉంది. రిషబ్‌ పంత్‌ అంపర్‌పై అసహనాన్ని వ్యక్తం చేయడంపై ఐసీసీ సీరియస్‌ అయినట్లు సమాచారం. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 61వ ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్ బౌండరీ బాదాడు. వెంటనే బాల్‌ సరిగ్గా లేదని పంత్ అంపర్‌కి తెలియజేశాడు. ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ రీఫెల్‌ బంతిని గేజ్‌తో పరిశీలించమని రీఫెల్ చేతికి బాలిచ్చాడు. అయితే బాల్ గేజ్‌లో పరీక్షించినప్పటికీ అది బాగానే ఉన్నట్లు వీడియోలో కనిపించింది. అయినా కానీ పంత్‌ బాల్‌పై ఉన్న మార్క్‌ని చూపిస్తూనే ఉన్నాడు. దీంతో సంతృప్తి చెందని పంత్‌ బంతిని నేలకేసి కొట్టాడు.
 
ఈ ఘటనతో పంత్‌పై కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కింద రెండు సంఘటనలు ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొదటిది అంపైర్ నిర్ణయంపై పంత్‌ అసమ్మతి వ్యక్తం చేయడం.. ఇక రెండవది అంపైర్‌తో తీవ్రంగా వాగ్వాదానికి దిగడం. ఐసీసీలోని ఆర్టికల్ 2.9 నిబంధన ప్రకారం “అంతర్జాతీయ మ్యాచ్ ఆడే సమయంలో ఏ ఆటగాడు కానీ ప్లేయర్ సపోర్ట్ పర్సన్, అంపైర్, మ్యాచ్ రిఫరీ లేదా మరే ఇతర మూడవ వ్యక్తిపై బంతిని లేదా వాటర్ బాటిల్ ఇంకా ఇతర క్రికెట్ పరికరాలను విసిరేయడం నిషేదం. వీటిని ఉల్లంఘిస్తే ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్లపై వేటు వేస్తుంది. అయితే ఎలాంటి వేటు అనేది మాత్రం ప్రభావ తీవ్రతను బట్టి ఉంటుంది. 


రిషబ్ పంత్ సరికొత్త మైలురాయి: ఇదే ఆటలో రిషబ్‌ పంత్‌ సరికొత్త రికార్డుని సష్టించాడు. 150 టెస్ట్ క్యాచ్‌లను సాధించిన మూడో భారతీయ వికెట్ కీపర్‌గా చరిత్రకెక్కారు. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో ఇంగ్లాడ్‌ బ్యాటర్‌ ఒలీ పోప్ క్యాచ్‌ అందుకోవడం ద్వారీ ఈ ఘనతను సాధించాడు. కేవలం 27 ఏళ్లలో రిషబ్‌ పంత్‌ ఈ మైలురాయిని చేరుకున్నాడు. పంత్ కంటే ముందు సయ్యద్ కిర్మానీ (160 క్యాచ్‌లు), ఎంఎస్ ధోనీ (256 క్యాచ్‌లు) మాత్రమే ఈ మైలురాయిని చేరుకోగలిగారు.

ఇక పంత్ తీసుకున్న 151 క్యాచ్‌లు, 15 స్టంపింగ్‌లతో కలిపి మొత్తం 166 డిస్మిసల్స్‌తో భారత్ తరఫున మూడో కీపర్‌గా నిలిచాడు. ఎంఎస్ ధోనీ 256 క్యాచ్‌లు, 38 స్టంపింగ్‌లతో మొత్తం 294 డిస్మిసల్స్‌లో భాగం అయ్యాడు. ప్రస్తుతం ఎక్కువ డిస్మసల్స్‌లో ధోని భాగం అయ్యాడు. అయితే ధోని రిటైర్మెంట్‌ ప్రకటించడంతో ఈ రికార్డుని పంత్‌ అధిగమించే అవకాశాలు ఉన్నాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News