Tuesday, June 24, 2025
Homeటెక్నాలజీOPPO K13x 5G: సూపర్ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో ఒప్పో K13x ఫోన్..

OPPO K13x 5G: సూపర్ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో ఒప్పో K13x ఫోన్..

OPPO K13x 5G: ఒప్పో తన K13 సిరీస్ కింద ఇండియాలో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. అదే ఒప్పో Oppo K13x. కంపెనీ పోయిన ఏడాది విడుదల చేసిన ఒప్పో K12x సక్సెసర్ గా మార్కెట్లో దీని విడుదల చేసింది. దీని ధర రూ. 15,000 కంటే తక్కువగా ఉండటం విశేషం. మిడ్‌నైట్ వైలెట్, సన్‌సెట్ పీచ్ రంగులలో లభిస్తోంది. ఈ ఫోన్‌లో మీరు 360-డిగ్రీల ఆర్మర్ బాడీ రావడం దీని ప్రత్యేకత. ఇప్పుడు Oppo K13x ఫోన్ కు సంబంధించి ఫీచర్లు, ధర, సేల్స్ వివరాల గురుంచి తెలుసుకుందాం.


ఫీచర్లు

Oppo K13x ఫోన్ లో 6.72-అంగుళాల అల్ట్రా బ్రైట్ LCD డిస్‌ప్లేను ఉంది. ఇందులో 1000 నిట్‌ల పీక్ బ్రైట్ నెస్ ఉంది. ఈ ఫోన్‌లో 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కనిపిస్తుంది. ఈ పరికరం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణను అందిస్తుంది. ఈ పరికరం మీడియాటెక్ 6300 ప్రాసెసర్‌తో అమర్చారు. అలాగే, ఈ ఫోన్ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కేవలం 37 నిమిషాల్లోనే 50 శాతం వరకు ఛార్జ్ చేయొచ్చు.

కెమెరా గురించి మాట్లాడితే..ఈ పరికరంలో 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.ఇక సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం.. పరికరంలో 8MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. బ్లూటూత్ 5.4 సపోర్ట్, USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, NFC, డ్యూయల్ సిమ్ సపోర్ట్‌ వంటి ఇతర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కలిగి ఉంది.

ధర

Oppo K13x ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ+128జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ. 10,999గా కంపెనీ పేర్కొంది. 6జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ. 11,999 కాగా, 8జీబీ+ 128జీబీ టాప్-ఎండ్ వేరియంట్ రూ. 14,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే, లాంచ్ ఆఫర్‌తో కంపెనీ రూ. 1,000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. ఈ పరికరం ఫస్ట్ సేల్ జూన్ 27 నుండి ప్రారంభమవుతుంది.ఫ్లిప్ కార్ట్, ఒప్పో ఇండియా ఈ స్టోర్ ఎంపిక చేసిన ఆఫ్లైన్ స్టోర్ ల నుంచి దీనిని కొనుగోలు చేయొచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News