world’s Biggest Cobra Video Viral: ఒకప్పుడు ఏదైనా విషయం తెలుసుకోవాలంటే టీవీల ద్వారానో, రేడియోల ద్వారానో తెలుసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు చీమ చిటుక్కుమన్న సోషల్ మీడియాలో వచ్చేస్తోంది. తెల్లారితే చాలు ప్రతి ఒక్కరూ ఫోన్ పట్టుకుని యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి యాప్స్ లో మునిగిపోతున్నారు. వీడియో బాగుంటే చాలు తెగ వైరల్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద గారు యానిమాల్స్ కు సంబంధించిన డిఫరెంట్ వీడియోలను తరచూ ఆన్ లైన్ లో షేర్ చేస్తుంటారు. గతంలో ఆయన కింగ్ కోబ్రాకు సంబంధించిన ఆయన పోస్ట్ చేసిన వీడియో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ వీడియోలో పాముల్లోనే అతి భయంకరమైన కింగ్ కోబ్రాను చూపించారు. ఇది ఏకంగా 20 అడుగులకుపైగా ఉండటం విశేషం. అంతేకాదు అది నిటారుగా లేచి నిల్చుని ఉండటం చూసి ఫారెస్ట్ అధికారులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు.
వరల్డ్ లో పాముల్లో రారాజు ఏదంటే కింగ్ కోబ్రా పేరే చెబుతారు. సాధారణంగా ఈ కింగ్ కోబ్రాలు 10 నుంచి 15 అడుగుల పొడవు మాత్రమే ఉంటాయి. అయితే వీడియోలో చూపించిన స్నేక్ ఇరవై అడుగులకుపైగా ఉండటం అందరినీ సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా పాములను చూస్తేనే మనం భయపడతాం. అలాంటి ఇంత పెద్ద కింగ్ కోబ్రాలను లైవ్ లో చూస్తే భయంతో మన ప్రాణాలు గాల్లోనే పోతాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ వీడియోపై నెట్టింట లైక్స్, కామెంట్స్ వర్షం కురుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ వీడియోను చూసేయండి.
వర్షాకాలం వచ్చేసింది. ఇలాంటి కింగ్ కోబ్రాలు మన ఇంటి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో పాములు ఇంట్లోకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా చిన్న పిల్లలు ఇంటి బయట ఆడుకునేటప్పుడు వారిని ఓ కంట కనిపెట్టి ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఏదైనా భయంకరమైన పాము వచ్చినట్లయితే వెంటనే స్నేక్ క్యాచర్స్ తెలియజేయాలని వారు సూచిస్తున్నారు.