Tuesday, June 24, 2025
Homeచిత్ర ప్రభDil Raju - Game Changer: ‘గేమ్ చేంజర్’ టేకప్ చేయటం నా మిస్టేక్.. ఓపెన్‌గా...

Dil Raju – Game Changer: ‘గేమ్ చేంజర్’ టేకప్ చేయటం నా మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పిన దిల్‌రాజు

Ram Charan: గ్లోబ‌ల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో గేమ్ ఛేంజర్ సినిమా ఒక పీడకల. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత చరణ్ నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా వస్తుందని ఫ్యాన్స్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. అందుకు కార‌ణం, శంక‌ర్ (Shankar) వంటి బిగ్ డైరెక్ట‌ర్ సినిమాను తెర‌కెక్కించ‌టంతో పాటు సినిమాను స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తుండ‌ట‌మే. హిట్ కాంబో కాబ‌ట్టి త‌మ అభిమాన హీరో రామ్ చ‌ర‌ణ్‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌స్తుంద‌ని ఫ్యాన్స్ ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్నారు. అనౌన్స్‌మెంట్ రోజు నుంచే మూవీపై హ్యూజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ వ‌చ్చాయి. అయితే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ ప‌రాజయాన్ని మెగాభిమానులు (Mega Fans) ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నార‌నేది కాద‌న‌లేని వాస్త‌వం.

- Advertisement -

గేమ్ చేంజ‌ర్ డిజాస్టర్ రిజల్ట్ తర్వాత సినిమా గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. డైరెక్ట‌ర్ శంక‌ర్ ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ తాను అనుకున్న విధంగా సినిమాను ఎడిట్ చేయ‌లేక‌పోయాన‌ని, స‌మ‌యం లేద‌ని అన్నారు. అయితే ఇంకెంత స‌మ‌యం కావాలంటూ ఫ్యాన్స్ ఆయ‌న‌పై రివ‌ర్స్ అయిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఎడిట‌ర్ షామిర్ మూవీ గురించి మాట్లాడుతూ గేమ్ చేంజ‌ర్ ముందుగా నాలుగున్న‌ర గంట‌లు వ‌చ్చింద‌ని చెప్పారు. బ‌డ్జెట్ హ‌ద్దులు దాటేసింద‌ని, ఎడిట్ విష‌యంలో ద‌ర్శ‌కుడికే క్లారిటీ లేద‌ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/nishvika-naidu-share-dance-floor-with-megastar-chiranjeevi-in-vishwambhara/

తాజాగా గేమ్ చేంజ‌ర్ మూవీ గురించి చిత్ర నిర్మాత దిల్ రాజు స్పందించారు. “గేమ్ ఛేంజర్ సినిమా నా చేతిలో లేకుండా పోయింది. గేమ్ ఛేంజర్ ముందు ఎడిట్ చేసిన‌ప్పుడు లెంగ్త్ నాలుగున్న‌ర గంట‌లు వ‌చ్చింది. నిజానికి ఒక స్టార్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేసిన అనుభవం నాకు లేదు. నేను ఎన్నో సినిమాలు తీశాను కానీ లెజెండరీ డైరెక్టర్ కోవకు చెందిన దర్శకులతో నేను చేయలేదు. నేను చేసిన సినిమాలన్నీ నా చేతుల్లో ఉండేవి. గేమ్ ఛేంజర్ నా చేతుల్లో లేకుండా పోయింది. ఈ విషయంలో నేను ఎవరిని నిందించడం లేదు. ఇలాంటి సినిమాని టేకప్ చేయడమే నా ఫస్ట్ మిస్టేక్. ఇన్‌వాల్వ్ అయితే ప్ర‌తీది కిచిడి అవుతుంది. అయితే ట్రిపులార్ త‌ర్వాత రామ్ చరణ్‌కి గేమ్ చేంజ‌ర్‌లాంటి సినిమా పడిందనే బాధ‌ నాకు చాలా ఉంది. అది తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. కానీ ఏం చేస్తాం? నాకు అలవాటు లేని ప్రాజెక్ట్‌ని ఎత్తుకోవడం నా మిస్టేక్” అని ఓపెన్‌గా త‌న త‌ప్పును ఒప్పుకున్నారు దిల్ రాజు.

గేమ్ ఛేంజ‌ర్‌ ఫ్లాప్ బాధ‌ని అదే సంక్రాంతి సీజ‌న్ కి వ‌చ్చిన ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ సినిమా కాస్త త‌గ్గించింది. ఈ సినిమాకు రూ.300 కోట్లు వ‌సూళ్లు రావ‌డంతో నిర్మాత దిల్ రాజు ఊపిరి పీల్చుకొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News