Tuesday, June 24, 2025
HomeదైవంSaturn Transit 2025: 30 ఏళ్ల తర్వాత శని-బుధల కలయిక.. ఈ 4 రాశులు పట్టిందల్లా...

Saturn Transit 2025: 30 ఏళ్ల తర్వాత శని-బుధల కలయిక.. ఈ 4 రాశులు పట్టిందల్లా బంగారం..

Samasaptaka rajyogam effect on Zodiac Signs: జూలై నెలలో శని గమనంలో పెను మార్పు రాబోతోంది. న్యాయదేవుడైన శని వక్రమార్గంలో నడవనున్నాడు. ఇదే సమయంలో ఇతడు బుధుడితో కలిసి మీనరాశిలో సమసప్తక రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ అరుదైన కలయిక మూడు దశాబ్దాల తర్వాత జరుగుతోంది. ఈ శక్తివంతమైన రాజయోగం వల్ల మూడు రాశులవారి తలరాత మారబోతుంది. ఆ అదృష్ట రాశిచక్రాల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

సింహ రాశి

మీనరాశిలో బుధుడు, శనిదేవుడు సంయోగం సింహరాశి వారికి ఎనలేని ప్రయోజనాలను ఇస్తుంది. వీరు తమ తెలివితేటలతో అనుకున్నది సాధిస్తారు. శాలరీ పెరగడంతోపాటు ఆదాయం వృద్ధి చెందుతుంది. బంధువుల మధ్య మనస్పర్థలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. గతం కంటే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి సమసప్తక  రాజయోగం అద్భుతంగా ఉండబోతుంది. మీ కెరీర్ మునుపటి కంటే బాగుంటుది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ రాశి వారి అదృష్టం మారబోతుంది. అన్ని కష్టాల నుండి బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి.

వృషభ రాశి

శని-బుధల సృష్టించబోతున్న సమసప్తక రాజయోగం వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది, వీరి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. వ్యాపారులు పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. సంతాన సుఖం కలుగుతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. మీ చిరకాల వాంఛ నెరవేరుతుంది. మీ సంపద వృద్ధి చెందుతుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది.

మీన రాశి

ఇదే రాశిలో 30 ఏళ్ల తర్వాత శక్తి వంతమైన ఈ యోగం ఏర్పడుతోంది.  దీంతో మీనరాశివారికి శనీశ్వరుడి కటాక్షం లభిస్తుంది. వీరికి ప్రతి పనిలో లక్ కలిసి వస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భారీగా ధనార్జన చేస్తారు. మీ వైవాహిక జీవితం సమస్యలన్నీ తొలగిపోయి భార్యభర్తల మధ్య అన్యోన్యోత పెరుగుతుంది. బిజినెస్ చేసేవారు మునుపెన్నడూ ఎరుగని లాభాలను చూస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News