Biggest King cobra attack on Snake Catcher: ప్రపంచంలోనే విషపూరిత పాముల్లో కింగ్ కోబ్రా ఒకటి. భూమ్మీద ఒక్క కాటుతో ఎంతటి జంతువునైనా, మనిషినైనా చంపేస్తోంది ఈ స్నేక్. దీనిని చూస్తేనే మనం భయంతో వణకడం మెుదలుపెడతాం. ఇండోనేషియా వంటి దేశాల్లోనే ఎక్కువగా కనిపించే ఈ పాములు మనదేశంలోనూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. వీటిని పట్టుకోవడం ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవడం అన్నమాట. వీటిని స్నేక్ క్యాచర్స్ కూడా చాలా చాక్యంగా పట్టుకుంటారు. అయితే ఒక్కోసారి మిస్ పైర్ అయ్యి వారి ప్రాణాలు కూడా కోల్పోతారు. తాజాగా ఓ స్నేక్ క్యాచర్ ఇలానే కింగ్ కోబ్రాను పట్టుకోబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.
వీడియో ఓపెన్ చేస్తే.. ఒక నీటిలో బండరాళ్లు మధ్య కింగ్ కోబ్రా వెళ్తూ ఉంటుంది. దానిని చూసిన స్థానికులు భయంతో స్నేక్ క్యాచర్ కు ఫోన్ చేస్తారు. కోబ్రాను పట్టుకునే వీడియో అందరూ చూడాలని అతడి వెనుక కెమెరామెన్ ను కూడా తీసుకొచ్చుకుంటాడు. ఇంతలో స్నేక్ క్యాచర్ బుసబుసలు కొడుతున్న ఆ భారీ సర్పం అంతు చూడాలని దానిపైకి వెళతాడు. ఆ వీడియోను కెమెరామెన్ రికార్డు చేస్తూ ఉంటాడు.
అయితే కాసేపట్లోనే సీన్ రివర్స్ అయింది. ఆ భారీ పామును పట్టుకోవడంలో అతడు విఫలమయ్యాడు. అది స్నేక్ క్యాచర్ పైకి దూసుకొస్తూ కాటువేయడానికి ప్రయత్నించింది. అంతేకాకుండా కాటు వేస్తుందనే భయంతో అతడు నీళ్లలో పడిపోయాడు. స్నేక్ క్యాచర్ ను కాపాడటానికి ప్రయత్నించి కెమెరామెన్ కెమెరాను పక్కకు తిప్పాడు. దీంతో ఆ తర్వాత ఏం జరిగిందనే విషయంపై క్లారిటీ లేదు. అయితే వీడియో చివర్లో కింగ్ కోబ్రా నీళ్లలో వెళ్తున్నట్లు కనిపించింది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతోంది. ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కెమెరామెన్ ఫెయిల్ అయ్యాడని కొందరు, కింగ్ కోబ్రాతో వ్యవహారించేటప్పడు జాగ్రత్తగా ఉండాలని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.