Sriram Remanded: డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన తమిళ హీరో శ్రీరామ్ కు చెన్నై ఎగ్మోర్ కోర్టు రిమాండ్ విధించింది. సోమవారం మధ్యాహ్నం చెన్నైలో డ్రగ్స్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు శ్రీరామ్ పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో నార్కోటిక్స్ ఇంటలిజెన్స్ అధికారులు ఆయన వద్ద నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రక్త నమూనాలు సేకరించి రిపోర్టుల కోసం ల్యాబ్ కు పంపారు. ఆ తర్వాత నుంగంబాక్కం స్టేషన్‌కు తరలించి విచారించారు.
అనంతరం ఎగ్మోరో కోర్టును హాజరుపర్చగా న్యాయస్థానం జులై 7వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు రిమాండ్ విధించడంతో చెన్నై జైలుకు తరలించారు. శ్రీరామ్ ను తమ కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారిస్తే మరింత కీలక సమచారం వస్తుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
అసలు ఏం జరిగిందంటే.. అన్నాడీఎంకే పార్టీకి చెందిన ప్రసాద్ తో సహా మరో ఇద్దరిని డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా శ్రీరామ్ కు డ్రగ్స్ సరఫరా చేస్తామని తెలిపారు. దీంతో పోలీసులు శ్రీరామ్ ను డ్రగ్స్ తో పట్టుకున్నారు. శ్రీరామ్ అరెస్టు కావడం, రిమాండ్ విధించడం కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయంటూ కొంతమంది సెలబ్రెటీలు భయపడుతున్నట్లు సమాచారం.
కాగా ఇటీవల సినీ సెలబ్రెటీలు డ్రగ్స్ వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగంపై జోరుగా ప్రచారం జరుగుతోంది. డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు టావినో థామస్ అరెస్టై కావడం సంచలనంగా మారింది. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ డ్రగ్స్ కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖులను అధికారులు వరుసగా విచారించిన విషయం విధితమే. దాదాపు పదుల సంఖ్యలో సెలబ్రెటీల పేర్లు బయటకు రావడం.. వారిని విచారించడం ప్రకంపనలు రేపింది. ఇప్పుడు కోలీవుడ్ లోనూ డ్రగ్స్ వినియోగంతో హీరో శ్రీరామ్ అరెస్ట్ కావడంతో ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయో చర్చనీయాంశంగా మారింది.
Sriram: హీరో శ్రీరామ్ కు జ్యుడిషియల్ రిమాండ్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES